ఈనెల 29వ తారీఖునాడు జరగబోతున్న అక్కినేని నాగార్జున పుట్టినరోజునాడు నాగ్ ముద్దుల కొడుకు అఖిల్ ఒక సంచలనం సృస్టించబోతున్నాడు. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం అఖిల్ వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు ‘తాండవం’ అని పేరు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనను ఈ సినిమా దర్శకుడు వినాయక్ అక్కినేని నాగార్జునతో షేర్ చేసుకున్నట్లు టాక్. 

నాగార్జునకు ఈ టైటిల్ బాగా నచ్చడంతో ఈ టైటిల్ విషయమై నాగ్ తన సన్నిహితుల అభిప్రాయాలను అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమధ్య ఈసినిమాకు ‘మిస్సైల్’ అన్న టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ టైటిల్ నిశ్చయించపడలేదు. 

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరిదశకు చేరడంతో ఈసినిమాకు కథ రీత్యా అన్నివిధాలా ‘తాండవం’ అన్న టైటిల్ బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ను అధికారికంగా నాగార్జున పుట్టినరోజునాడు ప్రకటిస్తారు అని టాక్. ఈసినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఆగస్టు 4 నుండి ప్రారంభoకాబోతోంది. 

ఈ షెడ్యూల్ తో ఈసినిమా షూటింగ్ పూర్తి అవుతుంది అని టాక్. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరావు జయంతి సందర్భంగా ఈసినిమా ఆడియోను ఘనంగా రిలీజ్ చేసి దసరా కానుకగా అక్టోబర్ 21న సినిమాను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మొట్టమొదటి సినిమాలోనే ఘాటు లిప్ లాక్ సీన్ లో నటిస్తూ మరో సంచలనం చేయబోతున్న అఖిల్ ఎటువంటి తాండవం ఆడబోతున్నాడో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: