తెలుగు చలన చిత్ర రంగంలో అగ్ర హీరోలు అథిరధ మహారధులు నటించిన సినిమా ‘మాయాబజార్’. ఈ సినిమాకు ఆలూరి చక్రపాణి, బొమ్మిరెడ్డి నాగి రెడ్డి (బిఎన్ రెడ్డి)  సారధ్యం వహించారు. ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడుదలై అద్భుత విజయం సాధించింది. 2007 మార్చినాటికి 50 ఏండ్లు పూర్తిచేసుకుంది. మాయాబజార్ చిత్రం ప్రతీ పాత్ర వేషధారణనీ, ప్రతీ సన్నివేశంలోని మనం ఎంత తీక్షణంగా ఊహిస్తే ఆ ఊహలు సజీవ చిత్రాలై మన కళ్ళ ముందు నిలిచాయో  ఆశ్చర్య పోనక్కర లేదు.


సినిమా కథా పరంగా చెప్పాంటే.. దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుని తో వివాహం నిశ్చయమైన శశిరేఖ ను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుని తో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవుల ను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలు.


మాయాబజార్ లో ఘటోత్కచుడుగా ఎస్.వి.రంగారావు


ఈ సినిమాలో వాడిన టెక్నాలజీ అప్పట్లోనే అద్భుత సృష్టికి ప్రతి సృష్టి చేసినట్లు అనిపిస్తుంది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం 1957 లో నిర్మించిన  ఈ చిత్రంలో వ్యూజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ మాయాజాలం లాంటివి ఏవి లేవు అసలు కంప్యూటర్ పరిజ్ఞానం అంతంతమాత్రమే.. ఇక ఈ సినిమా గురించి చెప్పాంటే..
 
 మార్చి 27 1957 న విడుదల అయిన ఈ చిత్రం 24 సెంటర్లలో 100 రోజులు ఆ తర్వాత సిల్వర్జూబ్లి జరుపుకుంది.

1957 లో ఉత్తమ తెలుగు చిత్రం గా ఫిలిం ఫేర్. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా, ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శన.

యస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచిన నాలుగు పాటలతో సహా మిగిలిన సంగీతాన్ని ఘంటసాల గారు అందించటం జరిగింది

 సంవత్సరం ప్రీ ప్రొడక్షన్ పని తర్వాతా 400 మంది కార్మికులతో, నటీ నటుల తో చిత్రీకరణ మొదలెట్టారు.

రంగుల చిత్రం గా మార్చబడిన మొదటి తెలుగు చిత్రం మాయ బజార్. గోల్డ్ స్టోన్ టెక్నాలజీ వారు 7.5 కోట్లు ఖర్చు చేసి ఆధునీకరించారు.

జనవరి 30 2010 న రంగుల మయా బజార్ చిత్రాన్ని తిరిగి విడుదల చేసారు, మరొక్క సారి 100 రోజుల వేడుక జరుపుకుంది.

2013 లో CNN – IBN వారు నిర్వహించిన పోల్ లో భారత దేశం లోనే చూడదగ్గ అత్యద్భుత చలన చిత్రాల జాబితాలో మొదటిది గా నిలిచింది.

2014 లో CNN – IBN వారు ప్రకటించిన “12 గొప్ప పుస్తకాలుగా మార్చగల భారతీయ చలన చిత్రాలు” లో ఒకటిగా నిలిచింది.

సింగీతం శ్రీనివాస రావు గారు ఈ చిత్రానికి సహాయ దర్శకులు గా పని చేసారు. ఆయన తీసిన ఒక బొమ్మల చిత్రానికి(ఘటోత్కచ) ఈ సినిమానే స్పూర్తి.


మరింత సమాచారం తెలుసుకోండి: