ఈవారం విడుదల కాబోతున్న ‘శ్రీమంతుడు’ సినిమాను సెన్సార్ సభ్యులు చూసారని అయితే చిన్న టెక్నికల్ ప్రాబ్లం రీత్యా ఈసినిమా సర్టిఫికేట్ రేపు సోమవారం వస్తుందని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. బయటకు వస్తున్న సెన్సార్ టాక్ ప్రకారం ఈసినిమా కొద్దిగా స్లోగా  ఉందనే మాటలు బయట వినిపిస్తున్నాయి. 

ఈ సినిమా కథ 1984లో వచ్చిన బాలకృష్ణ నటించిన ‘జననీ జన్మభూమి’ సినిమా  కథను పోలి ఉంది అన్న టాక్ కూడ వినిపిస్తోంది. దర్శకుడు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈసినిమా ఆనాటి రోజులలోని పల్లెల దోపిడీ విషయమై ఈసినిమా కథ నడిచింది. ఇప్పుడు కూడ ‘శ్రీమంతుడు’ లో మహేష్ గ్రామ దత్తత విషయాన్ని చూస్తే అలనాటి ‘జననీ జన్మభూమి’ గుర్తుకు వస్తుందని కొoదరి కామెంట్స్.

ప్రస్థుతం మహేష్ అభిమానులనే కాకుండా ఫిలింనగర్ విశ్లేషకులను కూడ ‘శ్రీమంతుడు’ సినిమా ఆకర్షిస్తూ ఉండటంతో ఈసినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అన్న చర్చలు అప్పుడే మొదలైపోయాయి. ఈ సినిమాను కోలీవుడ్ లో కూడ అత్యధిక ధియేటర్లలో విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈసినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం పవన్ ‘అత్తారింటికి దారేది’ ఫస్ట్ వీక్ కలక్షన్స్ ను క్రాస్ చేయడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.

‘బాహుబలి’ మ్యానియా తరువాత విడుదల కాబోతున్న తొలి టాప్ హీరో సినిమా కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ లోని అందరి దృష్టి ‘శ్రీమంతుడు’ పైనే ఉంది. ఈసినిమా ఫలితం టాలీవుడ్ టాప్ హీరోల స్థానాలలో కీలకమైన మార్పులు తీసుకు వస్తుంది అని అనడంలో సందేహం లేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: