రాజమౌళి ‘బాహుబలి’ విడుదలై నాల్గవ వారంలో అడుగు పెట్టి 500 కోట్ల టార్గెట్ వైపు పరుగులు తీస్తున్న నేపధ్యంలో ఈ సినిమాను తీసిన నిర్మాతలతో పాటు ఈ సినిమా బయ్యర్లు కూడ మంచి జోష్ పై ఉన్నారు. ఈ పరిస్థుతుల మధ్య ‘బాహుబలి 2’ కథకు తుది మెరుగులు దిద్దుతున్న రాజమౌళి తన సెకండ్ పార్ట్ విడుదల కాకుండానే రచించిన 1000 కోట్ల మాస్టర్ ప్లాన్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

సినిమాలు చూడటం మానివేసిన ప్రేక్షకులను కూడ ధియేటర్ల వైపు రప్పించిన రాజమౌళి ఈసారి చిన్న పిల్లలను టార్గెట్ చేస్తూ మరో ఎత్తుగడ వేసాడు.   ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘బాహుబలి’ సాఫ్ట్ టాయ్స్ పేరుతో కొన్ని ఉత్పత్తుల్ని తయార చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి రాజమౌళి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టాక్. 

ఈ సినిమాలో కీలక పాత్రలు అయిన బాహుబలి, భళ్లాలదేవ, శివగామి, దేవసేన, కట్టప్ప, కాళకేయ పాత్రలకు సంబంధించిన సాఫ్ట్ టాయ్స్ ను తయారుచేయించి అన్ని ప్రముఖ మాల్స్ లోను అమ్మకానికి సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మన భారతదేశంలో 1000 కోట్ల బిజెంస్ చేసే మార్కెట్ గా పేరున్న ఈ సాఫ్ట్ టాయ్స్ రంగాన్ని కూడ ‘బాహుబలి’ మ్యానియా ప్రభావితం చేయబోతోంది. 

‘బాహుబలి 2’ విడుదల కావడానికి ఇంకా 1 సంవత్సర కాలం గ్యాప్ ఉన్న నేపధ్యంలో ‘బాహుబలి’ ని జనం మర్చి పోకుండా రాజమౌళి వేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలో ఇదొక కొత్త మార్గం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా సినిమాలను అద్భుతంగా తీసి ప్రేక్షకులను మెప్పించిన రాజమౌళి మరి ఇప్పుడు పిల్లలను తన మేధస్సుతో ‘బాహుబలి’ టాయ్స్ తో ఏరకంగా ఆకట్టుకుంటాడో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: