లండన్ లో సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న జూనియర్ ఆ సినిమా పై తన దృష్టిని పెడుతూ ఊహించని విధంగా తన అన్న కళ్యాణ్ రామ్ కు అనుకోని షాక్ ఇచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ‘పటాస్’ సినిమా కళ్యాణ్ రామ్ కు కలిగించిన ఆనందం ‘కిక్ 2’ దూరం చేస్తోంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. రవితేజా మార్కెట్ స్థాయికి మించి ‘కిక్-2’ పై ఈసినిమా దర్శకుడు సురేంద్రరెడ్డి కళ్యాణ్ రామ్ చేత పెట్టించిన భారీ బడ్జెట్ ఈసినిమాకు శాపంగా మారింది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. 

దీనితో రకరకాల కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. దీనికితోడు ఈ సినిమా నిర్మాణ విషయంలో కళ్యాణ్ రామ్ సురేంద్రరెడ్డిల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు కూడ ఈ సినిమాకు శాపంగా మారాయి. ఇలాంటి పరిస్థుతులలో కళ్యాణ్ రామ్ విపరీతమైన టెన్షన్ కు లోనవుతున్నాడు అంటూ వార్తలు కూడ వచ్చాయి. అయితే జూనియర్ తీసుకున్న నిర్ణయంతో ‘కిక్ 2’ సమస్యల నుండి బయట పడటమే కాకుండా ఆ సినిమాను ఈనెల 21న విడుదల చేయడానికి జూనియర్ స్వయంగా రంగంలోకి దిగాడు అని టాక్.

ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసినిమా విడుదల కాకుండానే 15 కోట్ల లాస్ ఏర్పడిందని టాక్. దీనితో ఈసినిమాకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్షియర్లు ఈ లాస్ కు సంబంధించి ఎవరైనా హామి పడితేకాని విడుదలకు సహకరించం అని కళ్యాణ్ రామ్ కు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను లండన్ లో షూటింగ్ లో ఉన్న జూనియర్ తెలుసుకోవడంతో స్వయంగా జూనియర్ రంగంలోకి దిగి ఆ 15 కోట్లకు తాను హామీ ఉంటానని ఫైనాన్షియర్స్‌‌‌కు భరోసా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. దీనితో ‘కిక్ 2’ విడుదలకు లైన్ క్లియర్ అయింది అని అంటున్నారు 

ఈమధ్య కాలంలో జూనియర్ కళ్యాణ్ రామ్ ల మధ్య అన్నదమ్ముల అనుబంధం బాగా పెరిగిన నేపధ్యంలో జూనియర్ తీసుకున్న నిర్ణయంతో కళ్యాణ్ రామ్ గట్టెక్కినట్లే అని అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: