తెలుగు, హిందీ ఇండస్ట్రీలో తనకుంటూ ఓ సపరేట్ క్రేజ్ ఏర్పాటు చేసుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లో ఉండటం పరిపాటే.. అయితే ఆ మద్య సినిమాలు తీస్తూ వివాదాలు రేపే వర్మ కొత్తగా మరో పద్దతి ఫాలో అవుతున్నాడు అదే ఆయన అస్త్రంగా చేసుకున్నాడు మరి ఆ అస్త్రం ఏమిటనుకుంటున్నారా.. ‘ట్విట్టర్’ అవును సోషల్ మీడియా ద్వారా తనకు మనసులో ఏం ఉంటే అది వెల్లబుచ్చుతూ అటు సినీమా ఇండస్ట్రీ, పాలిటిక్స్ ఏవీ వదలడం లేదు.

తాజాగా శ్రీమంతుడు గురించి ట్విట్ చేసి టెన్షన్ పెట్టాడు. తను నైజాం డిస్ట్రీబ్యూటర్లను కలిసినట్లు బాహుబలితో సంబంధం లేకుండా శ్రీమంతుడు సూపర్ బిజినెస్ చేస్తుందని వారు నమ్మకం వ్యక్తం చేశారని ఈ లెక్కన శ్రీమంతుడు రిలీజ్ తర్వాత కూడా బాహుబలి బిజినెస్ పెరుగుతుందని అంటున్నారి అన్నాడు.  శ్రీమంతుడు, బాహుబలి గురించి వారి మాటల్లో అర్థం నాకు బోధ పడలేదు. సినిమాల బిజినెస్ ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు’ అంటూ ట్వీట్ చేసారు.


శ్రీమంతుడు పోస్టర్



ఇప్పుడు శ్రీమంతుడుకి సంబంధించి ప్రమోషన్ వర్క్స్ నడుస్తున్నాయి. టీవిల్లో చిత్ర యూనిట్ ఇంటర్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇక పోస్టర్లు రోజు డిఫరెంట్ స్టయిల్ లో వస్తున్నాయి. ఈ మద్య విడుదలైన ట్రైలర్ కి మంచి ఆధరణ లభించింది.  శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లుక్ ఫెంటాస్టిక్ అంటూ మరో ట్వీట్ చేసాడు వర్మ.

రాంగోపాల్ వర్మ ట్విట్స్

మరింత సమాచారం తెలుసుకోండి: