నూతన సంవత్సరం వచ్చింది అంటే చాలు సన్నీలియోన్ డాన్స్ షోలు లేకుండా భాగ్యనగర యూత్ కు కొత్త సంవత్సరం మొదటిరోజు తెల్లవారదు. ఆమె పట్ల యూత్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి చాల హోటల్స్, పబ్స్ ఆమెతో డాన్స్ షోలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అటువంటి సంఘటన నిన్న భాగ్యనగరంలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 

నిన్న జరిగిన ఫ్రెండ్ షిప్ డేని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఒక పబ్ సన్నిలియన్ డాన్స్ పోగ్రామ్ ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆమె డాన్స్ చేస్తుంటే చూడటం కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టి విపరీతంగా ఆ ప్రోగ్రాంకు జనం వచ్చారని టాక్. అయితే అంతమంది అభిమానులను ఒక్కసారి చూసిన సన్నీలియోన్ షాక్ అయి వారి ముందు డాన్స్ చేయడానికి ఖంగారుపడి సన్నీలియోన్ డాన్స్ చేయకుండా వెనుతిరగడంతో అభిమానులలో ఆవేశం పెరిగి పోవడంతో ఆ పబ్ యాజమాన్యం ఇటు ఈకార్యక్రమానికి వచ్చిన యూత్ కు అటు సన్నీలియోన్ కు సద్దిచెప్పి ఆ కార్యక్రమాన్ని ముగించారని టాక్. 

'జిస్మ్‌-2' ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ క్రేజ్ రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. ప్రస్తుతం ఆమె ఒక ప్రముఖ హిందీ ఛానల్ లో 'స్ల్పిట్స్‌విల్లా' అనే రియాలిటీ షో చేస్తోంది. ఈ షోకు కూడ మంచి రేటింగ్స్ వస్తున్నాయి. సన్నీ క్రేజ్ ను ఇప్పటికే మన దక్షిణాది నిర్మాతలు కూడ ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

అయితే సన్నీ మాత్రం తనకు నటనకు ఆస్కారం ఉన్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలోను టాప్ హీరోల పక్క హీరోయిన్ గాను నటించాలని ఉంది అంటూ తన కోరికను వ్యక్త పరుస్తోంది. కానీ మన దేశ యువతరం మాత్రం సన్నీని ఐటమ్ గర్ల్ గా మాత్రమే చూస్తూ ఆరాధిస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: