తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్లలో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న హాట్ బ్యూటీ రకూల్ ప్రితి సింగ్. ఇప్పుడు ఈ అమ్మడికి చేతినిండా సినిమాలే ఉన్నాయి అంతే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపిస్తుంది ఈ హాట్ భామ. తీసినవి కొన్ని సినిమాలే అయినా మంచి హిట్ సాధించాయి. ప్రస్తుతం యంగ్ హీరోలు ఈ అమ్మడినే ఎక్కువ ఇష్ట పడుతున్నారంటే మరి ఈ రకూల్ చేసిన మాయాజాలం అలాంటిది అన్నమాట.

ప్రస్తుతం అల్లు అర్జున్, ఎన్టీఆర్,చరణ్ ల సరసన సినిమా షూటింగ్ లు నడుస్తున్నాయి. త్వరలో కిక్ 2 లో తన అందాలతో హాట్ లుక్స్ ఇస్తు అందరినీ ఆకర్షిస్తుంది. అయితే ఈ హాట్ బ్యూటీ మన దర్శక ధీరుడు రాజమౌళిని చాలా గొప్పగా పొగిడేస్తుంది.... బాహుబలి సినిమా గురించి చెబుతుంటే వినడమ జరిగిందని షూటింగ్స్ బిజీ వల్ల సినిమా చూడలేక పోయానని ఎట్టకేలకు ఆదివారం ఈ సినిమా చూసిందట అంతే రాజమౌళికి ఫిదా అయిపోయిందట. 

బాహుబలి పోస్టర్


తెలుగు ఇండస్ట్రీలో హాలీవుడ్ రేంజ్ లో తిసినట్లు అనిపిస్తుందని ఇంత గొప్ప సినిమాలు ఇక్కడ కూడా తీయగలరు అని నిరూపించారని అంటూ  ట్విట్టర్ ద్వారా తెలిపారు.‘తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది బాహుబలి సినిమా. తమన్నా,ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ నటన అద్భుతంగా ఉంది. ఇంత గొప్ప సినిమా తీసిన తెలుగు సినిమా పరిశ్రమలో నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా  ఉందంటూ ట్విట్టర్ లో తెగ పొగిడేస్తుంది. 

రకూల్ ప్రతిసింగ్ ట్విట్స్

మరింత సమాచారం తెలుసుకోండి: