తెలుగు సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు హీరో ప్రిన్స్ మహేష్ బాబు.  చిన్నప్పటి నుంచి వెండితెరకు పరిచయం అయిన మహేష్ ‘రాజకుమారుడు’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పదహారు సంవత్సరాలు అవుతుంది. కొత్తలో ఎత్తు పల్లాలు చూసిన ప్రిన్స్ ఒక్కడు,అతడు, ఆగడు,పోకిరి,దూకుడు లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలతో నెం.1 పొషీషన్ కి పోటీగా మారాడు.

కొరటాల శివ దర్శత్వంతో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఆగస్టు 7 న విడుదల కాబోతుంది. ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన మనసులో మాట ఇంటర్వూల్లో చెబుతున్నాడు. నాకు తెలుగు అభిమానులు అంటే చాలా ఇష్టమని తన సత్తా ఏమిటో తనకు తెలుసు అని అభినులను తన దగ్గరి ఫ్రెండ్స్ ని కలిసినపుడు నేనేమిటో అన్న విషయం వాళ్లు నాకు చెబుతారు అంటూ చిరునవ్వు నవ్వారు. తెలుగు ఇండస్ట్రీ ఎంతో మంది గొప్ప హీరోలకు పుట్టిన ఇల్లు అని అసలు ఏ ఇండస్ట్రీలో ఇక్కడ తీసినన్ని సినిమాలు తీయ్యరని అన్నారు. ఇలాంటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.  

శ్రీ మంతుడు పోస్టర్


ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఎంట్రీ గురించి అడిగినపుడు  నా భాషలో నన్ను ఆదరిస్తున్నప్పుడు నేను ఇంకెక్కడికో వెళ్లాల్సిన అవసరం ఏమిటి?  అని మహేష్ ఎదురు ప్రశ్నించాడు. ఇప్పటి వరకు నా సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఆదరించి నన్ను అభిమానిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడే నిలదొక్కుకోవాలి కానీ ఇంకెక్కడికో వెళ్లడం ఎందుకని అడిగాడు.  ఒకవేళ బాలీవుడ్ లో అవకాశం వచ్చినా  తెలుగులో సినిమాలు చేయడమే తనకు ఇష్టమని మహేష్ అన్నారు. శ్రీమంతుడు సినిమా చాలా డిఫరెంట్ కథతో వస్తుందని అందరూ ఈ సినిమాను తప్పకుండా ఆధరిస్తారని భావిస్తున్నా అని అన్నారు మహేష్ బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: