ఎస్ ఎస్ రాజమౌళి దీక్షతో రెండున్నర సంవత్సరాలు కష్టపడి తీసిన చిత్రం ‘బాహుబలి’ అందుకే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తెలుగు సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ గా రూపొందిచిన ఈ సినిమా అప్పుడే పెట్టు బడి రాబట్టింది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఆయా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు చెరిపేస్తు కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాలో నటించిన నటులకు సైతం మంచి ఆదరణ లభిస్తుంది.

ప్రస్తుతం బాహుబలి టీమ్ ఎంజాయ్ మెంట్ లో ఉంది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఇప్పుడు సీక్వెల్ కు రంగం సిద్దం అయింది. రాజమౌళి  ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ సన్నాహాల్లో ఉన్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతూ కొత్త నటుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందుకనే జక్కన్న మరో కోణంలో ఆలోచిస్తున్నారు. బాహుబలి 2 లో బాలీవుడ్ నటినటులను కూడా నటింప చేయాలనే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న.

బాహుబలి హిందీ వర్షెన్.. రాజమౌళి, కరణ్ జోహార్


బాలీవుడ్ లో కరణ్ జోహార్  ఆధ్వర్యంలో ఈ సినిమా మంచి ప్రమోషన్స్ చేశారు... అందుకే జక్కన్న అక్కడ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. సో... ఇప్పుడు బాహుబలి 2 లో అక్కడి స్టార్స్ కు ఈ సినిమాలో చాన్స్ ఇస్తే సినిమాకు  ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఇటు తెలుగులో అటు హిందీలో మంచి క్రేజ్ సంపాదించుకోవచ్చని ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. ఇక పోతే  ఈ సినిమా ఈ నెల చివరనుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: