మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు షష్టిపూర్తి వేడుకలకు సంబంధించిన ఆగష్టు నెల ప్రారంభం అయినా మెగా కాంపౌండ్ నుండి చిరంజీవి షష్టిపూర్తి వేడుకల హంగామాకు సంబంధించిన అధికారక ప్రకటన ఇంకా ఏమి మెగా కాంపౌండ్ నుండి విడుదల కాకపోవడం చిరంజీవి వీరాభిమానులకు కొంత షాకింగ్ గా ఉంది అని టాక్. గత నెలలో చిరంజీవి అభిమాన సంఘాల సమావేశం జరిగినప్పుడు చిరంజీవి షష్టిపూర్తి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు జూలై నేలాఖరకు బయటకు వస్తాయి అని చెప్పినట్లుగా తెలుస్తోంది. 

అయితే చిరంజీవి పుట్టినరోజునాడు చిరూ 150 వ సినిమా ప్రారంభం అవుతుంది అని కలలు కన్న అభిమానులకు ఆ కల తీరకపోగా కనీసం చిరంజీవి షష్టిపూర్తి వేడుకలకు సంబంధించిన అధికారిక సమాచారం ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ప్రతి విషయంలోనూ చిరంజీవి ఇలా ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు అన్న బాధ చిరంజీవి వీరాభిమానులలో రోజురోజుకు బాగా పెరిగి పోతోంది అని టాక్. 

తమ అభిమాన హీరో తన నట విశ్వరూపాన్ని చూపెడుతూ 150వ సినిమాలో సందడి చేస్తాడు అనుకుంటే రామ్ చరణ్ సినిమాలో అతిథిగా చిరంజీవి నటిస్తాడు అన్న వార్తలు మెగా అభిమానులలోని కొందరికీ షాకింగ్ గా మారింది అని టాక్. 

రామ్ చరణ్ శ్రీనువైట్లల సినిమాలలో చిరంజీవి నటించడం వల్ల చరణ్ సినిమా ఓపెనింగ్ కలక్షన్స్ పెరుగు తాయి కాని చిరంజీవిని మెగా స్టార్ హోదాలో వెండితెర పై చూసుకుందాము అనుకున్న తమ కోరికను చిరంజీవి చరణ్ సినిమాలో చేయబోయే అతిథి పాత్ర ఏ మేరకు చిరంజీవిని క్రేజ్ ను పెంచుతుంది అన్న బాధమధ్య కొందరు చిరంజీవి వీరాభిమానులు తమలో తాము మధన పడుతున్నట్లు టాక్. ఈ విషయాలు చిరంజీవి వరకు వెళితే చిరూ తమ అభిమానుల కోసం ఎలా స్పందిస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: