మామూలుగా ఒక సినిమా ఒకటీ, రెండు సార్లు లేదా మూడు నాలుగు సార్లు చూస్తారు.. కానీ మన హీరో ఏకంగా వంద సార్లు సినిమా చూశారట .. ఏం సినిమా..? ఏవరూ హీరో అనకుంటున్నారా..! తెలుగు ఇండస్ట్రీలో ఈస్ట్ మన్ కలర్  సినిమా స్కోప్ చిత్రంగా వచ్చిన అల్లూరి సీతారామ సూపర్ స్టార్ కృష్ణకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది.  ఎన్టీఆర్ ఈ సినిమా చూసి కృష్ణ ను చాలా మెచ్చుకున్నారట..అయితే అంతకు ముందు కొంత కాలంగా వీరికి మాటలు లేకపోవడం ఈ సినిమా చూసి కాంప్లిమెంట్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యిందట ఆ రోజుల్లో.

ఇక ఈ సినిమా  అంటే ఆయన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబుకు చాలా ఇష్టమట.  ఈ సినిమా  నాకు ఓ బైబిల్ లాంటిదని అందుకే దాన్ని ఒకటికి రెండుసార్లు చూడాలి తప్ప దాన్ని చేసే ఉద్దేశ్యం మాత్రం లేదని ఆ సినిమాని టచ్ చేసేది లేదని అన్నారు మహేష్ బాబు. బ్రిటిష్ పరిపాలకులు మన దేశాన్ని పరిపాలిస్తూ అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతుంటే ఒక మన్నెంలో విప్లవ శంఖారావాన్ని పూరించిన మన్నెం వీరుడి వీరగాధే అల్లూరి సీతారామరాజు.  

అల్లూరి సీతారామరాజు పోస్టర్


ఈ చిత్రాన్ని మహేష్ బాబు చేస్తే చూడాలని కోరకుంటున్న అభిమానులకు మహేష్ ఒక్కటే చెప్పాడు..ఈ సినిమా నాకు నాకు బైబిల్ లాంటిదని ఇలాంటి ఇతిహాసాలు ఎవరికో ఒక్కరికే సూట్ అవుతాయని అలాంటిది నాకు..నో నో.. అన్నారు. అయితే ఈ సినిమా మాత్రం ఇప్పటివరకు కనీసం వందసార్లు ఆ చిత్రాన్ని చూశానని కాబట్టి ఆ క్లాసిక్ చిత్రాన్ని టచ్ చేసేది లేదని అన్నారు మహేష్ .


మరింత సమాచారం తెలుసుకోండి: