తెలుగు ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రయోగాలు చేయడంలో మొదటి నుంచి ఎంతో ఆసక్తి చూపించేవారు... అలాంటి ప్రయోగంలోంచి పుట్టిందే ‘ఈగ’. ఒక పెద్ద హీరో లేకున్నా కూడా గ్రాఫిక్ మాయాజాలంతో విలన్ ని ముప్పతిప్పలు పెట్టే చిన్న జీవంతో సినిమా అద్భుతమైన సీన్లు తీసి  థియేటర్లో కూర్చోబెట్టారు. రాంచరణ్ తో మగధీర, తర్వాత ఈగ లాంటి సినిమాలు తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీ రూపు రేఖలు మార్చారు.

ఈ మద్య తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దిన చిత్రం ‘బాహుబలి’ ఇక దీని గురించి ప్రత్యేకంగా వేరే చెప్పనక్కర లేదు.. ఎందుకంటే ఇప్పటి వరకు బాహుబలి ఫీవర్ ఎవరికీ తగ్గలేదు...ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటారు ఈ సినిమాతో... దాదాపు నలభై సంవత్సరాల తర్వాత ఒక జానపద చిత్రం ఇంత గొప్పగా తీయడం అనేది జక్కన్నకే కుదిరింది. 2012లో రిలీజ్ అయిన ఈగ సూపర్ హిట్ అయి పలు భాషల్లోకి డబ్ కూడా అయ్యింది. మొదట్లో ఈ సినిమా టైటిల్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు.. హీరో లేకుండా ఏంటీ ప్రయోగాలు అన్నారు తర్వాత అన్నవారే ముక్కున వేలు వేసుకున్నారు.


ఈగ పోస్టర్


తాజాగా బాహుబలి సంచలన విజయంతో తెలుగువాడి ఖ్యాతి దశ దిశలా వ్యాపింప జేసిన జక్కన్న బాహుబలి 2 తర్వాత ఈగ 2 చేయడానికి రంగం సిద్దం చేసుకున్తున్నాడట . ఈగ చిత్రానికి సీక్వెల్ చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాడు జక్కన్న అయితే ఆ సీక్వెల్ చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాడట .  వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి గారు నిర్మించిన చిత్రం ఈగ. ఎస్.ఎస్. రాజమౌళి గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ఎం.ఎం. కీరవాణి గారు సంగీతాన్ని అందించారు 


మరింత సమాచారం తెలుసుకోండి: