తెలుగు ఇండస్ట్రీలో అత్యద్భుతంగా రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదలైన బాహుబలి చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతుంది. ఈ సినిమా  ఇండియాలో హ‌య్య‌స్ట్ వ‌సూళ్లు సాధించిన మూవీగా ‘బాహుబ‌లి’ సినిమా రికార్డులు నెల‌కొల్పుతుంద‌ని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఈ అంచనాలు తలకిందులైనాయి.. అవును కలెక్షన్ల పరంగా దూసుకు పోతున్న బాహుబలికి సల్లూ భాయ్ బ్రేక్ వేశారు.  

ఇప్పటికే బాహుబలి 500 కలెన్లు సాధించి హిందీలో అల్ టైమ్ రికార్స్ అయిన పికె,దూమ్3 తర్వాత స్థానాన్ని కొల్లగొట్టాలని చూసింది. ఇండియాలోని టాప్ 3 గ్రాస‌ర్స్ లో బాహుబ‌లికి స్థానం రిజ‌ర్వ్ అయింద‌ని తెలుగు సినిమా ప్రేక్ష‌కులంతా సంబ‌ర‌ప‌డ్డారు. కానీ అదంతా రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటారా..! భ‌జ్‌రంగీ భాయ్‌జాన్‌తో స‌ల్మాన్ ఇప్పుడు పీకే త‌ర్వాతి స్థానాన్ని అందుకోవ‌డానికి ప‌రుగులు పెడుతున్నాడు. అయితే బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్లూభాయ్ చిత్రం ఊహించ‌ని స్థాయిలో భారీ విజయాన్ని అందుకోవ‌డంతో దాని జోరు క‌లెక్ష‌న్ల‌లో బాహుబ‌లిని మించిపోతోంది.

బాహుబలి పోస్టర్


బాహుబలి చిత్రానికి ఓ మైనస్ పాయింట్ ఉంది తెలుగు వారు అక్కడ పెద్దగా తెలిసినవారు కాకపోవడం ఎందుకంటే తమిళనాడు లో రనిజీకాంత్ సినిమాలు అంటే బాలీవుడ్ లో కూడా పవర్ హీరో గా నమ్ముతారు కానీ బాహుబలి చిత్రంలో ఇప్పటి వరకు అసలు మోకాలు చూసిన పాపాన పోలేదు అందుకే కాస్త ఇబ్బంది కరంగా మారింది. సాధార‌ణంగా ఒక బాలీవుడ్ చిత్రానికి, అందునా ఖాన్‌ల చిత్రాల‌కు భారీ హిట్ కొడితే ఈ క‌లెక్ష‌న్లు సాధ్య‌మే. క‌ర‌ణ్ జోహార్ వంటి నిర్మాత‌ను రంగంలోకి దింప‌డం, సినిమా కూడా జనానికి న‌చ్చ‌డంతో క‌లెక్ష‌న్లు భారీగా పెరిగాయి. బాహుబ‌లి ఆశ‌ల‌పై నీళ్లు ‘బాహుబ‌లి’కే బాలీవుడ్ హీరో షాకిచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: