ఈవారం విడుదల కాబోతున్న ‘శ్రీమంతుడు’ ఫైనల్ కాపీని చూసి జగపతిబాబు అలిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ తండ్రిగా నటిస్తున్న జగపతి బాబు పాత్ర చాల కీలకమే అయినా జగపతిబాబు నటించిన కొన్ని సన్నివేశాలు ‘శ్రీమంతుడు’ ఎడిటింగ్ లో  తీసివేయడంతో ఈసినిమాలో జగపతిబాబు పాత్ర నిడివి బాగా తగ్గిపోయింది అని టాక్. 

‘శ్రీమంతుడు’ ఫైనల్ కాపీని చూసిన జగపతిబాబు ఈసినిమాలో తనది ప్రధాన పాత్ర అనుకోవాలా లేదంటే అతిథి పాత్ర అనుకోవాలా తనకే అర్ధంకాలేదు అంటూ ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ దగ్గర ఘాటుగా కామెంట్ చేసినట్లు టాక్. అయితే ఈ విషయం మహేష్ దృష్టి వరకు వెళ్ళడంతో సినిమా నిడివి మరీ పెరిగి పోతుంది అన్న ఉద్దేశ్యంతో జగపతి బాబు పాత్రను కొంత వరకు కొరటాల శివ తగ్గించాడని ఈ విషయమై ఎటువంటి కోపం పెట్టుకోవద్దు అంటూ మహేష్ జగపతి బాబుకు సద్ది చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈవార్తలు ఇలా ఉండగా ‘శ్రీమంతుడు’ క్రేజ్ అమెరికాను అప్పుడే తాకింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమా మొట్టమొదటి టిక్కెట్టును అమెరికాలోని డెట్రాయిట్ కు చెందిన నవీన్ ఎరినేని 15 వేల డాలర్లకు వేలం పాటలో కొన్నాడు అన్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో ఒక తెలుగు టాప్ హీరో మొట్టమొదటి షో మొదటి టిక్కెట్ కు ఇంత భారీ స్థాయిలో రేటు పలికిన సందర్భాలు గతంలో లేవు.

మహేష్ అభిమానులలో రోజురోజుకు పెరిగిపోతున్న ‘శ్రీమంతుడు’ క్రేజ్ తో హైదరాబాద్ విజయవాడలలో కూడ ఈసినిమా స్పెషల్ షోలను 7వ తారీఖు తెల్లవారుఝామున నుండి షోలు వేయడానికి మహేష్ అభిమానులు అప్పుడే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ షో టిక్కెట్లు కూడ వేలరూపాయల ధర పలకనున్నట్లు టాక్. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం ‘శ్రీమంతుడు క్రేజ్ తారా స్థాయికి చేరుకుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: