తెలుగు ఇండస్ట్రీలో ‘కూలీ నెం.1’ చిత్రంలో వెంకటేష్ సరసన  వచ్చిన హాట్ బ్యూటీ టబు తర్వాత నాగార్జునతో  ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ టబు మంచి హైట్ పర్సనాలిటీ ఉండటంతో ఇక్కడ ఇండస్ట్రీవాళ్లు ఈ అమ్మడికి తర్వాత కాలంలో ఆంటీ, వదిన, అక్క పాత్రలు ఇస్తామన్నారు దీంతో బాలీవుడ్ కు పయనమైంది. అక్కడ కొన్ని సినిమాలు చేసి మంచి పేరే సంపాదించుకుంది.

టబు ముంబాయిలో స్థిరపడ్డా సొంత ఊరు మటుకు హైదరాబాద్. ఇక్కడే చదువు పూర్తి చేసుకుంది ,ఈమె నటి ఫరాహ్ చెల్లెలు. ఫరాహ్ బాలీవుడ్ లో హీరోయిన్ గా నటించింది. అయితే సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంత మాంది లేటుగా పెళ్లిలు చేసుకుంటారు ఈ కోవలోకే వస్తుంది టబు. ఇప్పుడు  ఈ అమ్మడి వయసు 44 ఇప్పటికే ముదిరిపోయి కుమారిగానే ఉంది అంటూ బాలీవుడ్ లో గుస గుసలు.  ఈ మద్య టబు పెళ్లి చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది.

టబు నటించిన తెలుగు సినిమాలు నిన్నే పెళ్లాడుతా,కూలీ నెం.1 పోస్టర్లు

 

ఇప్పుడు ముంబైకు చెందిన యువ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని సదరు కుర్ర బిజినెస్ మేన్ టబునే పెళ్లి చేసుకుంటానని వెంటబడుతున్నాడని చెప్పుకుంటున్నారు. టబు పెళ్లి గురించి ఇంటర్నెట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు,తమిళ,మళియాళి భాషల్లో సూపర్ హిట్ అయిన దృశ్యం బాలీవుడ్ లో తీస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా టబు అదరగొట్టినట్లు హీరో అజయ్ దేవగన్ తన అభిప్రాయం తెలిపారు. ఇప్పుడు ఈ ముదురు భామ పెళ్లి వార్త ఇప్పుడు చెక్కెర్లు కొడుతోంది. ప్రస్తుతం టబు వయసు 44 ఏళ్లు మరి. ఈ వార్తలు నిజం అవుతాయో, అబద్దం అవుతాయో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: