పవన్ కు ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ మాటలు పవన్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘సర్దార్’ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ ఆలోచనల పై హరీష్ శంకర్ సూచనలు తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నాయి అని టాక్. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాగా ఈ సంవత్సరం రికార్డులు క్రియేట్ చేస్తున్న సల్మాన్ 'భజరంగీ భాయ్‌జాన్‌' విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ విషయంలో కూడ సునామీని సృష్టి స్తోంది. 

ఈ నేపధ్యంలో ఈసినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయమై హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు సూచనలు చేయడంతో పవన్ ఈ విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు టాక్. పవన్ ఈసినిమాలో నటించడానికి అంగీకరిస్తే నిర్మాత దిల్ రాజు, రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి నిర్మించడానికి ఇప్పటికే ముందుకు వచ్చాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న ఈసినిమా 500 కోట్ల మార్క్ ను చేరుకుంది. అయితే గతంలో కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విజయ్ ‘కత్తి’ సినిమా రీమేక్ లో  పవన్ నటిస్తాడు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా చూసిన తరువాత పవన్ ఆ సినిమా రీమేక్ లో తాను నటించను అని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

అయితే నార్త్ ఇండియాలోని ఒక వ్యక్తి కథ రీత్యా పాకిస్తాన్ వెళ్ళి అక్కడ సమస్యలు ఎదుర్కున్న సందర్బాలు చూపెడితే ఉత్తారిది ప్రేక్షకులు అంగీకరించారు. మరి దక్షిణాది ప్రాంతానికి చెంది ముఖ్యంగా తెలుగువాడు అయిన ఒక టాలీవుడ్ హీరో ఒక పాప కోసం పాకిస్తాన్ వెళ్ళాడు అంటే తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా పవన్ అభిమానులు ఎంత వరకు ఆదరిస్తారు అన్నది సమాధానంలేని ప్రశ్న. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: