ఇప్పుడు మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంపైన కూడా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రిన్స్ మ‌హేష్‌బాబు-మిర్చి ఫేం కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న శ్రీమంతుడు సినిమా వ‌చ్చే శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే అభిమానుల్లో అంచనాలతో పాటు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే పాజిటివ్ రెస్పాన్స్ ఉండడం కూడా కామన్ గా జరిగే విషయమే.. కానీ రిలీజ్ కి ముందే ఇండస్ట్రీ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకునే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఈ వారం బాక్స్ ఆఫీసు ముందుకు రానున్న సినిమా శ్రీమంతుడు . సినిమా చాలా బాగా వచ్చిందని, సినిమా కచ్చితంగా అభిమానుల్ని, తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా ఈ సినిమా బాగా వచ్చిందని ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇలా ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు అభిమానుల్ని మెప్పించడమే కాకుండా, బాక్స్ ఆఫీసు వద్ద భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంటాయి.

 శ్రీమంతుడు పోస్టర్


ఈ లెక్క ప్రకారం ‘శ్రీమంతుడు’ మొదటి వారం సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకుంటుందని అంటున్నారు. శృతి హసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతి మహేష్ ల మద్య ఘాటు లిప్ లాక్ సీన్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ తో ఈ విషయం కన్ఫర్మ్ అయ్యినట్టుంది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ నుండి అందరికి మహేష్ అంటే అదో క్రేజ్ . అంతే కాకుండా ఇప్పటికే మహేష్ త్రిష , అమీషా పటేల్, కాజల్ లతో ముద్దు సీన్స్ లో నటించాడు. ఇప్పుడు శృతి హసన్ తో చేసిన ఈ లిప్ లాక్ సీన్ ఎలా ఉంటుందో చూడాలి ? 



మరింత సమాచారం తెలుసుకోండి: