ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత దేశ హీరోల్లో రజినీకాంత్ పేరు వినిపిస్తుంది. ఈయన సినిమాలు తెలుగు,హిందీ భాషల్లోనే కాకుండా చైనా, జపాన్,సింగపూర్ లాంటి దేశాల్లో హల్ చల్ చేస్తాయి.. అందుకే ప్రపంచం గుర్తించిన హీరో రజినీకాంత్. ఇక తమిళ సూపర్ స్టార్ గా వాళ్ల అభిమాన దేవుడి గా కొలుస్తారు అభిమానులు. సాధారణంగా పండుగలు వస్తేనే  సంబరపడతారు కానీ అక్కడ రజినీకాంత్ సినిమా వస్తుందంటే పండుగ చేసుకుంటారు.

ఇక తెలుగు దర్శకుల్లో దర్శక ధీరుడిగా పేరు తెచ్చకున్న రాజమౌళి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు భాషలో తీసిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించే స్థాయికి తీసుకు వచ్చారు జక్కన్న. మరి ఈ ఇద్దరి  కలయికలో సినిమా అంటే ఎలా ఉంటుంది? ఊహించడానికే అద్భుతంగా ఉంది కదూ! మరి ఈ కాంబినేషన్‌పై దర్శకుడు రాజమౌళి కూడా ఎగ్జైటింగ్‌గానే ఉన్నారు. ఆ మద్య జరిగిన ఓ ఫంక్షన్లో రజినీకాంత్ స్వయంగా రాజమౌళిని కలిసి నీ దర్శకత్వంలో ఓ సినిమా తీయాలని ఉంది అని తన మనసులో మాట చెప్పాడట దీంతో ఉబ్బి తబ్బిబైన జక్కన ఆ చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారట.

బాహుబలి పోస్టర్


ఇదే విషయాన్ని రాజమౌళి ముందు ప్రస్తావిస్తే ఆయన మాట్లాడుతూ.. “రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమా చేయమని అడగడం గొప్ప విషయమే! అయితే ఒక స్టార్ హీరోతో సినిమా తీయాలంటే  అందుకు తగ్గ బలమైన కథ ఒకటి ఉండాలి.  ఆయనకు ఎంతో గొప్ప స్టార్ డమ్ ఉంది... దానికి తగ్గట్టుగానే బలమైన కథ ఉంటేనే నేను ఆ సినిమా చేయగలను అన్నారు. ప్రస్తుతం రాజమౌళి, తన బాహుబలి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే ‘బాహుబలి 2’తో రాజమౌళి టీమ్ మళ్ళీ బిజీ కానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: