సినిమా ఇండస్ట్రీకి ఒక సామాన్య నృత్య దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లారెన్స్ ఇప్పుడు మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కొరియోగ్రఫర్ గా కొంత కాలం పెద్ద హీరోకు పని చేసిన లారెన్స్ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. అవి అంత హిట్ కాలేదు.. తర్వాత కాలంలో దర్శకుడిగా అవతారం ఎత్తాడు ముఖ్యంగా హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘ముని’ ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

‘ముని’ సిరీస్‌లోని మూడు సినిమాలూ ఘన విజయం సాధించి దర్శకుడిగా లారెన్స్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాంచన తర్వాత కాంచన 2 తెలుగులో గంగ సినిమా ఈ వేసవి కాలంలో విడుదల చేశాడు. పెద్ద సినిమాలతో పోటీ పడి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాఘవ లారెన్స్ రెండు వరుస సినిమాలకు కమిటయ్యారు.  గంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంది ‘మొండి శివ గుండు శివ’ అంటూ చెప్పే డైలాగ్ ను ఇప్పుడు టైటిల్ గా పెట్టి సినిమా తీస్తున్నాడు లారెన్స్. ఇదే ఊపుతో లారెన్స్ మరో సినిమా తీయబోతున్నాడు.. వెందార్ మూవీస్ సంస్థతో కలిసి రాఘవ లారెన్స్ రెండు సినిమాలకు సైన్ చేశారు.

గంగ (ముని 3) పోస్టర్


‘మొట్టశివ కెట్ట శివ’ పేరుతో తెరకెక్కనున్న ఓ సినిమాను ఈ ఉదయమే లాంచ్ చేశారు. ఈ సినిమా కూడా హర్రర్, కామెడీ జోడించిన చిత్రంగా తెరకెక్క బోతుంది. వెందార్ మూవీస్ సంస్థతో కలిసి రాఘవ లారెన్స్ రెండు సినిమాలకు సైన్ చేశారు. ‘మొట్టశివ కెట్ట శివ’ పేరుతో తెరకెక్కనున్న ఓ సినిమాను ఈ ఉదయమే లాంచ్ చేశారు. అయితే ఇప్పటికే లారెస్స్ ఈ సినిమా గురించి ఇప్పటికే సూపర్ స్టార్ రజనీ కాంత్, నాగార్జున, సూర్య ఇలా పెద్ద హీరోలను సంప్రదించారు. మరి ఈ సినిమాలో ఆ స్టార్ హీరో ఎవరూ అనేది ఇంకా అధికారికంగా చెప్పలేదు. మరి ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే లారెన్స్ ఖాతలో మరో హిట్ సాధించ బోతున్నాడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: