యువహీరోల్లో చాలా మందిని ఇంచుమించుగా పవన్‌ మేనియా వెంటాడుతున్న మాట వాస్తవం. దాన్ని ప్రదర్శించుకోవడానికి కొందరు మొహమాటపడరు. తాజాగా పవన్‌కల్యాణ్‌ హీరోయిన్‌ను.. యువహీరో ఆది తన సరసనజోడీగా ఎంపిక చేసుకున్నారు. సాయికుమార్‌ కొడుకు గా సినీ హీరో కెరీర్‌ ప్రారంభించి.. తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్న ఆది.. ఇటీవలే చుట్టాలబ్బాయి అనే టైటిల్‌తో చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంకా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకాని ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉంటుందని వారు చెబుతున్నారు. 


అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా అత్తారింటికి దారేదిలో పవన్‌ సరసన ఒక హీరోయిన్‌గా చేసిన ప్రణీతను ఎంపిక చేశారు. తెలుగులో అవకాశాలు ఇటీవలి కాలంలో ప్రణీతకు తక్కువగానే ఉంటున్నాయి. అలాంటిది ఇప్పుడీ యువహీరోతో జట్టుకట్టడం ఆమె అవకాశాలను కూడా పెంచుతుందని అనుకుంటున్నారు. మొత్తానికి హీరో చాలా కాంబినేషన్లను పరిశీలించిన తర్వాత.. ప్రణీతను ఫైనల్ గా ఓకె చేసినట్లు సమాచారం. 


ఆదిచేస్తున్న ఈ చిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకుడు. పూలరంగడు ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చౌదరి దీన్ని కూడా అదే మాదిరి కామెడీ రంగరించిన లవ్‌స్టోరీగా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఎస్‌ఎస్‌ థమన్‌ దీనికి సంగీతం అందిస్తారు. మిగిలిన నటీనటులు ఇంకా ఫైనలైజ్‌ కాలేదు గానీ.. పవన్‌ సరసన అత్తారింటికి దారేది వంటి హిట్‌ అందించిన ప్రణీత కాంబినేషన్‌ ఈ యువహీరో ఆదికి ఎంత మాత్రం కలిసొస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: