తమిళ ఇండస్ట్రీ లో  రజినీ తర్వాత  అత్ర క్రేజ్  సంపాదించుకున్న హీరో విజయ అనే చెప్పాలి. విజయ్ హీరోగా వచ్చిన కొత్తలో అంతగా హిట్ కాకపోయినా తర్వాత కాలంలో మంచి హిట్ సినిమాలతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  ఈ మద్య ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది ఈ సందర్భంగా విజయ్ తన మనసులో మాట చెప్పాడు..  నాకు చాలా రోజులుగా హిస్టరికల్‌ బేస్‌డ్‌ మూవీలో నటించాలి, అయితే అందులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏవీ మిస్‌ కాకుండా ఉండాలని కోరిక ఉండేది. ఈ 'పులి' చిత్రంతో ఆ కోరిక తీరపోయింది.  

శ్రీదేవి గొప్ప నటి ఇందులో ఆమె  కీలకపాత్రలో నటించారు. ఆవిడ దాదాపు 27 సంవత్సరాలు తర్వాత నా సినిమాలో నటించడానికి అంగీకరించినందుకు నా కృతజ్ఞతలు. ఇక ఈ సినిమా తెలుగులో ‘పులి’ గా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.. అయితే టం అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో షాక్ కు గురి చేస్తున్న విషయం. ఈ చిత్రం రైట్స్ ని గతంలో తుపాకి చిత్రం రైట్స్ పొందిన ఎస్ వి ఆర్ మీడియా వారు తీసుకున్నారు.

పులి తమిళ్ వర్షన్ ఆడియో వేడుకలో చిత్ర యూనిట్


ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి యూట్యూబ్‌లో ఈ చిత్రం టీజర్‌ను దాదాపు 60 లక్షల మంది వీక్షించడం పై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నటుడు విజయ్‌ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.గతంలో ఒకరోజులో అధిక వ్యూస్ వచ్చిన టీజర్‌గా అమీర్‌ఖాన్‌ నటించిన 'పీకే' చిత్రం రికార్డు సాధించింది. అయితే ఆ రికార్డును'ఇలయ తలబది' నటించిన 'పులి' చిత్రం తిరగరాసింది. ఒక రోజులో 10 లక్షల కన్నా ఎక్కువ మంది అంటే ఇప్పటి వరకు ఈ టీజర్‌ను 12.5 లక్షల మంది వీక్షించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: