ఈవారం విడుదల కాబోతున్న మహేష్ ‘శ్రీమంతుడు’ కి కీలకంగా మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘పోకిరి’ సెంటిమెంట్ గా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ‘శ్రీమంతుడు’ సినిమాను సూపర్ హిట్ చేయడానికి ఎన్ని దారులు ఉంటాయో అన్ని దారులు అన్వేషిస్తున్న మహేష్ ‘పోకిరి’ సినిమాలో తనకు కలిసి వచ్చిన పంచే కట్టు సెంటిమెంట్ ను ‘శ్రీమంతుడు’ సినిమాలో కూడ ఉపయోగించాడు. ‘దిమ్మతిరిగే’ పాటలో మహేష్ పంచె కట్టుతో కనిపించబోతు ఉండటంతో మహేష్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా ఉంది.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘శ్రీమంతుడు’ కామెడీ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మహేష్ అభిమానులకే కాక అన్ని వర్గాల ప్రేక్షుకులకు ‘శ్రీమంతుడు’ నచ్చుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమా ఫస్ట్ హాఫ్ అంతా మహేష్ శ్రుతిహాసన్ ప్రేమ సన్నివేశాలతో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని తెలుస్తోంది. ఈ సన్నివేసాలలో మహేష్ నిజమైన కాలేజీ అబ్బాయిలా చాలా ఫ్రెష్ గా అందంగా కనిపించాడు అని టాక్. 

ఇక ఈసినిమాకు గుండెకాయిలా ఈ సినిమా సెకండ్ ఆఫ్ నిలుస్తుందని  సినిమా కధలోని అసలు ట్విస్టులు అన్ని సెకండ్ ఆఫ్ లో వస్తాయని టాక్. ఈ సెకండ్ ఆఫ్ లోనే హై డోసేజ్ సెంటిమెంట్ తో పాటు ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ ‘శ్రీమంతుడు’ ని సూపర్ హిట్ స్థాయికి చేరుస్తుందని అంటున్నారు. ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో మహేష్ ఎప్పుడూ లేని విధంగా ఒక సెంటిమెంట్ సీన్ లో ఒక పెద్ద డైలాగ్ చెపుతాడని ఈ డైలాగ్ ఈ సినిమా ఘన విజయానికి గుండె కాయిగా మారుతుందని అని అంటున్నారు. ఈ భారీ డైలాగ్ తో కూడిన సీన్ మహేష్ జగపతి బాబుల మధ్య ఉంటుందని తెలుస్తోంది. 

సుమారు 50 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు 68 కోట్ల బిజినెస్ చేసిందని టాలీవుడ్ వర్గాల టాక్. ఈమధ్య కాలంలో మహేష్ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయిన నేపధ్యంలో ఈసినిమా ఫస్ట్ డే మొదటి షో టాక్ చాల కీలకంగా మారే పరిస్థుతులు కనిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: