ఈ సంవత్సరం తెలుగు సినిమాలో జోరు బాగా పెరిగిపోయిందనే చెప్పాలి... ఇప్పటి బాహుబలి క్రియేట్ చేసిన షాకింగ్ రికార్డులు మరిచిపోక ముందే మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ కూడా సంచలనాలు సృష్టిస్తుంది.  ఈ సినిమా ట్రైలర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. యూట్యూబ్ లో సాంగ్స్, మేకింగ్ వీడియోలకు విపరీతమైన లైక్స్ వచ్చిపడుతున్నాయి. తాజాగా శ్రీమంతుడు టికెట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయి రికార్డు నెలకొల్పాయి. మహేష్ బాబుకి బాలీవుడ్ తరహాలో విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్స్ ఫోలోయింగ్ ఉంది. ఆయన గత సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లో భారీ వసూళ్లు సాధించాయి.

ఈ నేపథ్యంలో ఈ సారి ‘శ్రీమంతుడు' సినిమాను అమెరికాలో రికార్డు స్థాయిలో 150 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. ఇక అమెరికాలో మహేష్ వీరాభిమానులు  యూఎస్ ప్రీమియర్ షోకు సంబంధించిన తొలి 10 టికెట్లను ఏకంగా 15000 అమెరికన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇక మన కరెస్సీలో చెప్పాంటే.. 9.58 లక్షలు అవును అక్షరాల అంతే.. మరి సినిమా విడుదల కాకముందే ఇంత క్రేజ్ ఏంటబ్బా అంటే.. సినిమాకు  వస్తున్న హైక్ అలా ఉంది.

శ్రీమంతుడు లెటెస్ట్ ఫోటో


తాజాగా ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు.. అంతేనా ఈ సినిమా దర్శక,నిర్మాలను సెన్సార్ బోర్డు వారు తెగ మెచ్చుకున్నారట. ప్రశాంతంగా ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూడదగ్గ చిత్రమని క్లీన్ చీట్ ఇచ్చారట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు. బాబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సుకన్య, సంపత్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: