కన్నడంలో పెను సంచలనాలు సృష్టించిన హీరో ఉపేంద్ర. అప్పట్లో ఈయన చిత్రం విడుదలైందంటే.. ఫుల్ హంగామా ఉండేది.  కన్నడ విలక్షణ హీరో ఉపేంద్ర చేసిన ఉపేంద్ర చిత్రం ఎవరూ మర్చిపోరు.  అయితే ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ సాధించింది. ఉపేంద్ర అప్పట్లో చిత్రవిచిత్రమైన టైటిల్స్ పెట్టి అందరినీ ఆకర్షించే వాడు. తెలుగు ఉపేంద్ర హిట్ కావడంతో ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయ్యాడు.

ఆ క్రేజ్ మొన్నామధ్య సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో కీలకపాత్ర చేసేలా చేయగలిగింది. తాజాగా ఉపేంద్ర కు సీక్వెల్ గా ఉపేంద్ర 2 తీయబోతున్నారు. పారుల్ యాదవ్, క్రిష్టినా అకీవా నాయికలుగా నటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను ఉపేంద్ర-2 పేరుతో నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) తెలుగులో అందిస్తున్నారు. ఇదే నెలలో కన్నడంలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు.

ఉపేంద్ర చిత్రం పోస్టర్


ఉపేంద్ర కన్నడంలో హిట్ సాధించిన చిత్రాలు తెలుగులో ఎ, ఉపేంద్ర, రా చిత్రాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఉపేంద్ర 2  చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగులో త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా కన్నడంలో ఉప్పి-2 పేరుతో ఓ చిత్రాన్ని ఉపేంద్ర నటిస్తూ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భవ్య, కెమెరా: అశోక్ కశ్యప్, సంగీతం: గురుకిరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: