సినిమా ఇండస్ట్రీకి ఒక చిన్న కొరియోగ్రఫర్ గా వచ్చి ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగిన హీరో, దర్శకుడు, నిర్మాత లారెన్స్.  ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్ గా వచ్చినప్పటికీ నటుడిగా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు కానీ మొదట్లో అంతగా సక్సెస్ కాలేదు. కానీ ముని కాన్సెప్ట్ తో హర్రర్, కామెడీ జోడించి సినిమా తీశాడు అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది దాంతో ఈ సినిమా సీక్వెల్ గా రెండు చిత్రాలు తీశాడు. కాంచన, కాంచన 2 తెలుగు లో గంగ ఈ సినిమాలతో లారెన్స్ ఆర్ధికంగా లాభపడటమే కాకుండా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

తమిళ, తెలుగు సినీ నటుడు, దర్శక నిర్మాత, నృత్యదర్శకుడైన రాఘవ లారెన్స్ తనలోని ఉదారస్వాభావాన్ని మరోమారు చూపించారు. భారతరత్న, అణుశాస్త్ర పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరిట పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీనిపై ఆయన చెన్నైలో మాట్లాడుతూ తన సొంత నిర్మాణ సంస్థ రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటిస్తున్న రెండు కొత్త ప్రాజెక్టులను వేందర్ మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల పేరు... మొట్టశివ.. కెట్టశివ, నాగ.

గంగ(ముని 3) లో లారెన్స్


ఈయన తీస్తున్న ‘మొట్టశివ కెట్టశివ’ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన వేందర్ మూవీస్ నుంచి లారెన్స్ నిన్న రూ.కోటి చెక్కును అందుకున్నారు. ఈ మొత్తాన్ని కలాం పేరిట పేదలకు సాయంగా ఇవ్వనున్నట్లు ఆయన అక్కడికక్కడే ప్రకటించారు.  కలాం దేశం కోసం ఎంతో చేశారని ఆయనకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేమని నేను చేసేది పెద్ద విషయమే కాదని లారెన్స్ అన్నారు. 100 మంది నిజాయితీగల యువతీ యువకులను ఎంపికచేసి తలా లక్ష చొప్పున కేటాయించి, వారిద్వారా నిజంగా అవసరంలో ఉన్న పేదలకు సాయం అందించేలా ఓ ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. అలాగే నటీనటులు, సినీ కళాకారులందరినీ కలాం పేరిట సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: