తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా వచ్చిందంటే అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.. పాలాభి షేకాలు, పుష్పాభిషేకాలు పెద్ద పెద్ద కటౌట్ లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఫుల్ లెంత్ సినిమాతో పవర్ సినిమా డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్న ‘సర్ధార్’ సినిమా షూటింగ్ లో పవన్ బిజీ బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ (గబ్బర్‌సింగ్2) జూలై 29 నుండి రెగ్యులర్ షూటింగ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

మొన్న జూలై 31న ఫస్ట్‌లుక్ విడుదల చేశాడు చిత్ర నిర్మాత.  ఇక ఈ సినిమా కూడా అప్పుడే ప్రచారాలు మొదలు పెట్టడం మొదలు పెట్టినట్లు అనిపిస్తుంది. ఆగష్టు 1న దర్శకుడు బాబీ పవన్‌తో కలిసి దిగిన ఫోటో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు కూడా. కాగా ఇప్పుడు పవన్ పోలీస్ డ్రస్‌లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లోకి దూసుకుని వచ్చాయి. పవన్ గురించి ఒక కవి చెబుతూ పవన్ అంటే వ్యసనం అని నీ పిచ్చి ఎన్నాళ్లో అన్నాళ్లు అన్నేళ్లు నీ గుండెలో కొలువై ఉంటాడు.. అని చెప్పినట్లు పవన్ అభిమానులు ఆయను తమ గుండెల్లో దాచుకుంటారు  ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది.

షరత్ మారన్, బాబి,పవన్ కళ్యాన్


హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో రెండు దృశ్యాలు లీక్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా స్టిల్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. మొన్న విడుదల చేసిన పవన్ వెనుకనుండి ఉన్న ఫస్ట్‌లుక్ పోస్టర్‌కే స్పందన అదిరిపోయింది.  మరి ఇప్పుడు పవన్ కనిపించే ఫోటో వచ్చింది ఇక పవన్ అభిమానుల సంబరాలకు అవధులే ఉండవు...


మరింత సమాచారం తెలుసుకోండి: