తెలుగు చిత్ర సీమలో నందమూరి వంశానికి మంచి పేరుంది... ఎన్టీఆర్ వారసత్వంగా వచ్చిన నట సింహ బాలకృష్ణ ఇప్పటికీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందిస్తూనే ఉన్నారు.. ఇక ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు కూడా మంచి హీరోలుగా స్థిరపడ్డారు. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమాతో మంచి టెంపర్ మీదే ఉన్నాడు ఎన్టీఆర్. సుకుమార్ దర్శకత్వంలో రకూల్ ప్రతిసింగ్ హీరోయిన్ గా ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ షర వేగంగా జరుగుతుంది.

తాజాగా తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన  ‘కత్తి’ సినిమా తెలుగు లో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు వార్త లు వినిపిస్తున్నాయి. రైతులపై జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టేందుకు ఒక యువకుడు చేసే పోరాటమే కత్తి సినిమా కథా సారంశం. కోలీవుడ్ విలక్షణ దర్శకుడు మురుగదాస్, తమిళ సూపర్ స్టార్ ఇళయథలపతి విజయ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘కత్తి’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! రైతుల సమస్యల్ని ఎలా తీర్చాలోనన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. తమిళంలో రజినీ కాంత్ తర్వాత అంతటి పేరు సంపాదించకున్న హీరో విజయ్.

తమిళ్ కత్తి సినిమా పోస్టర్


ఈ సినిమాలో విజయ నటనకు నూరు మార్కులు పడ్డాయట. అంతే కాదు అన్ని వర్గాల నుంచి ప్రశసంలు పొందాడట. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించి వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ ‘కత్తి’ సినిమా రీమేక్ లో నటించేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిద్ధమైపోయారని సమాచారం. ‘బలుపు’, ‘పండగ చేస్కో’ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇక తెలుగు వర్షన్ కోసం స్వయంగా మురుగదాసే స్క్రీన్‌ప్లేలో మార్పులు చేయనున్నారట. సుకుమార్ తో సినిమా అయిపోగానే ఇక ఎన్టీఆర్ ‘కత్తి’ పట్టుకోబోతున్నాడన్నమాట.? 

మరింత సమాచారం తెలుసుకోండి: