ఈ మద్య సోషల్ మీడియాలో ఒక అమ్మాయి సినిమా ఇండస్ట్రీపై విమర్షల వర్షం కురింపి తెగ హల్ చల్ చేస్తుంది మరి ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా..! అన్నపూర్ణ సుంకరి ఈమె సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరినీ వదల్లేదు.. తెలుగు సినిమా దర్శక, హీరోలతో పాటు కామెడీయన్ అలీని తిట్టింది. ఇక అలీని అయితే బండ బూతులు తిడుతూ యాంకర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిసారని డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతారని సుంకరి విమర్శించింది.

దీనిపై అలీ స్పందిస్తూ.. నిజా నిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడటం అన్నపూర్ణ కు అలవాటైందని వాస్తవానికి సుమ తనకు చెల్లెలు లాంటిదని ఇండస్ట్రీలో అందరం కలిసి మెలిసి ఉంటామని చెప్పారు. అంతే కాదు సమంత నడుంపై జోక్ వేశానని అంటు వచ్చిన వార్తలు ఖండిస్తూ సమంత తనకు మంచి స్నేహితురాలని.. సెట్స్ లో చాలా సంతోషకరమైన వాతావరణంలో ఉంటామని వివరణ ఇచ్చారు. ఇక అప్పట్లో సమంత వెయిస్ట్ బెంజ్‌సర్కిల్ అంటూ చేసిన కామెంట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇక దీనిపై వివరణ ఇస్తూ. సమంత తనకు మంచి స్నేహితురాలని, ఆ విషయం సమంత కూడా మీడియాతో చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

అన్నపూర్ణ సుంకరి సినిమా ఇండస్ట్రీపై కామెంట్స్


ఇక పోతే సుమను తాను కామెంట్ చేశానని అనడం అస్సలు న్యాయం కాదని యాంకరింగ్ చేసేటపుడు ప్రేక్షకులకు కాస్త ఎంట్రటైన్ చేయాలని కామెడీ చేస్తేమ తప్ప ఎవరినీ దురుద్దేశంతో చూడమని మాట్లాడమని అలీ అన్నారు. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకలో తనపై సుమ అలిగివెళ్లిపోయిందని వచ్చిన వార్తలు అవాస్తవమని, సుమ కొడుకు పుట్టిన రోజు ఉండటం వల్ల తనను యాంకరింగ్ చేయమంటూ రిక్వెస్ట్ చేసిందని చెప్పుకొచ్చాడు. తను నాకు చెల్లిలాంటిని చెప్పుకొచ్చాడు.  వెండితెరమీదా, ఆడియో వేడుకల్లో యాంకరింగ్‌తో హల్ చల్ చేసే అలీ ఫిలాంతర్ ఫగిడీ అంటూ ఆడియన్స్‌ను నవ్విస్తాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: