ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి సంబంధించిన తాజా రూమ‌ర్ ఒక‌టి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌ర్కులేట్  అవుతుంది. అయితే దానిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిప్పికొట్టేశాడు. దీనికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్  ‘సర్దార్’ మూవీని స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుండి ఇండ‌స్ట్రోలో సంద‌డి మొద‌ల‌యింది.

కొంతకాలంగా గడ్డంతో కనిపిస్తూ వస్తున్న పవన్ కళ్యాన్.. క్లీన్ షేవ్ తో కనిపించడంతో పాటు ఈ సినిమా షూటింగ్ తో బిజీ అవడమే.. అభిమానుల ఆనందం వెనకున్న అసలు కారణం. ఇక ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సర్దార్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇక్కడే మరికొన్ని రోజులపాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఇక‌ పవన్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ రీమేక్ న్యూస్ సందడి చేస్తోందిప్పుడు. సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగీ భాయిజాన్' సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే.

ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారనేది లేటెస్ట్ న్యూస్. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుందనే వార్త‌కు మరింత క్రేజ్ వచ్చింది. ఓ ప్రముఖ తెలుగు నిర్మాతతో కలసి ఈ సినిమా హిందీ నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించనున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడట.

గతంలో సల్మాన్ సూపర్ హిట్ మూవీ దబాంగ్ ను, పవన్ గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ ను అందుకోవడం ఈ రీమేక్ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. అయితే ఈ వార్త‌లు అన్నీ క‌ల్పితం అంటూ ప‌వ‌న్, త‌న స‌న్నిహితుల‌కి క్లారిటి ఇచ్చాడంట‌. ఇవ్వ‌న్నీ ఎవరో కావాల‌నే క్రియేట్ చేస్తున్నార‌ని క్లారిటి ఇచ్చుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: