శంకర్, రజనీ అభిమానులు ఇద్దరూ రోబో 2 చిత్రం కోసం గ‌త కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన సస్క్రిప్టుపై రాత్రింబవళ్లూ శంకర్ కూర్చుంటునట్లు సమాచారం. కోలీవుడ్ నుండి అందుతున్న క్లియ‌ర్ టాక్స్ ప్ర‌కారం లండన్ లో రోబో2 స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే శంక‌ర్ మ‌రో ఇంటర్నేష‌న‌ల్ యాక్ట‌ర్ ని రోబో2 కి ఒప్పించిన‌ట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే, భారత సినీ పరిశ్రమ గర్వించేలా విజయాన్ని సొంతం చేసుకున్న 'రోబో‌' సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతున్న గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని శంకర్‌ సన్నిహిత వర్గాల వద్ద ప్రస్తావించినా.. అవుననే సమాధానాలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇందులో రజనీకాంత్‌ నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విలన్‌గా షారఖ్‌ఖాన్‌ నటిస్తున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఓ ఎత్తయితే.. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కోలీవుడ్‌లో మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది. అదే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్. ర‌జ‌నీకాంత్ హీరోగా ఉంటే, విలన్ గా ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఉంటున్నాడు.

లండన్ లో శంక‌ర్ ఇప్ప‌టికే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ తో మాట్లాడి డేట్స్ ని ఫైన‌ల్ చేసుకున్న‌ట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కి రోబో2 క‌థ ప్రాముఖ్య‌త ఏమిటో చెప్ప‌టానికే, త‌ను ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు ప‌నుల‌ను లండన్ లో పూర్తి చేస్తున్న‌ట్టుగా వారు చెబుతున్నారు.  మొత్తంగా దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ స‌మాచారం త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.ఇదిలా ఉంటే రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ సినిమా అనంత‌రం, రోబో2 సెట్స్‌పైకి వెళ్ళనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: