తెలుగు ఇండస్ట్రీలో అందాల భామగా గుర్తింపు తెచ్చుకొని ఈ తరం అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన హాట్ భామ కాజల్ అగర్వాల్. కళ్యాన్ రామ్ తో ‘లక్ష్మీ కళ్యానం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు తర్వాత మగధీర సినిమాతో బంపర్ హిట్ కొట్టింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన ‘టెంపర్’ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ల సరసన కాజల్ కూడా ఉంది.

ఈ అమ్మడు ఇప్పుడు తమిళ రంగంవైపు ఎక్కువ దృష్టి పెట్టడంతో తెలుగులో కాస్త ఆఫర్లు తగ్గాయనే చెప్పాలి. ఇప్పుడు కాజల్ అందరినీ భయపెట్ట బోతుందట.. నిజమే లారెన్స్ త్వరలో తీయబోయే సినిమా కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నాడట. ఇప్పటికే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో లారెన్స్ ముని, కాంచన,కాంచన 2 సినిమాలు తీస్తూ మంచి హిట్లు అందుకున్నాడు.  పెద్ద సినిమాలతో పోటీ పడి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.


గంగ (ముని 3) పోస్టర్


ఇక ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాఘవ లారెన్స్ రెండు వరుస సినిమాలకు కమిటయ్యారు.  గంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంది ‘మొండి శివ గుండు శివ’ అంటూ చెప్పే డైలాగ్ ను ఇప్పుడు టైటిల్ గా పెట్టి సినిమా తీస్తున్నాడు లారెన్స్. ఇదే ఊపుతో లారెన్స్ మరో సినిమా తీయబోతున్నాడు.. వెందార్ మూవీస్ సంస్థతో కలిసి రాఘవ లారెన్స్ రెండు సినిమాలకు సైన్ చేశారు. ఈ సినిమాలో కాజల్ ఏ రేంజ్ లో భయపెట్ట బోతుందో త్వరలో వేచి చూడాల్సిందే...


మరింత సమాచారం తెలుసుకోండి: