తెలుగు సినిమానే కాదు టాప్ హీరోల డేట్స్ ను కూడ శాసిoచిన బ్ర‌హ్మానందం విపరీతమైన టెన్షన్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక టాప్ హీరో సినిమా వచ్చింది అంటే అందులో బ్రహ్మి ఉండితీరాలి అన్న బాక్స్ ఆఫీసు ఫార్మలాకు ఈ సంవత్సరం తెర పడిపోయింది. 

కేవలం నెల లోపు వ్యవధిలో టాలీవుడ్ లో కలెక్షన్స్ ప్రభంజనాలు సృస్టించిన ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ సినిమాలలో బ్రహ్మానందం లేకపోవడంతో పాటు అసలు ఈరెండు సినిమాలలోను కామెడీ ట్రాక్ ప్రత్యేకంగా లేకపోవడంతో కామెడీ ట్రాక్ లేకపోయినా తెలుగు ప్రేక్షకులు సినిమాలు చూస్తారు అనే విషయాన్ని దర్శక నిర్మాతలకు తెలియ చెప్పడమే కాకుండా సినిమా  సూపర్ హిట్ కావడానికి బ్రహ్మీ అవసరం లేదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.

 ఈ సంవత్సర ప్రారంభంలో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయిన కళ్యాణ్ రామ్ ‘పటాస్’ లో కూడా బ్రహ్మీ లేకపోవడంతో చిన్న సినిమాల సూపర్ హిట్ కు కూడ బ్రహ్మీ అవసరం లేదు అనే విషయాన్ని తెర పైకి తీసుకు వచ్చింది. ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కు మహేష్ తో పాటు సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించిన బ్రహ్మీ అదే బ్రహ్మీ లేకుండా మహేష్ ‘శ్రీమంతుడు’ గా సాధించిన విజయం టాప్ హీరోలకు బ్రహ్మీ అవసరం లేదు అన్న సంకేతాలను తెలియచేస్తోంది.

ఇప్పటికే సప్తగిరి, వెన్నెల కిషోర్ లాంటి యంగ్ కమెడియన్లు బ్రహ్మీ స్థానాన్ని పురిస్తారా? అని వార్తల వస్తున్న నేపధ్యంలో ఇదే నెలలో విడుదల కాబోతున్న రవితేజ ‘కిక్ 2’ లో మాస్ మహారాజతో సమానంగా ప్రధాన పాత్ర చేసిన బ్రహ్మీ పాత్ర ఆ సినిమాకు ఏ స్థాయిలో ఉపయోగ పడుతుంది అన్న విషయాన్ని బట్టి బ్రహ్మీ భవిష్యత్ టాలీవుడ్ లో ఆధారపడి ఉంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టీ ‘కిక్ 2’ విజయం రవితేజాకు కాదు బ్రహ్మీకి అవసరంగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: