పండుగలు వస్తున్నాయంటే థియేటర్లో సినిమాల హడావిడి ఎలా ఉంటుందో ఆన్ సెట్స్ మీద ఉన్న సినిమాల సందడి కూడా అంతే ఉంటుంది. కొద్దికాలంగా పండుగలు వస్తున్నాయంటే చాలు తమ సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ అని రకరకాలుగా అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు స్టార్ హీరోలు. ఇక రేపు 69వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ అభిమానులకు ఏదో ఒక విధంగా గిఫ్ట్ ఇవ్వాలని చాలా మంది అగ్ర హీరోలు పోటీ పడుతున్నారు. ఆగష్టు15 సందర్భంగా నాని సినిమా ఆడియో విడుదల చేస్తుండగా రేపు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా సర్ధార్ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నారట.   

 

పవన్ కళ్యాణ్ లేకుండానే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న సర్ధార్ సినిమా, పవర్‌స్టార్ రాకతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక పవర్‌స్టార్ కూడా ఈ సినిమా కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నాడన్నది తెలిసిన విషయమే. అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా పవర్‌స్టార్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా సర్ధార్ పోస్టర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడట. ఆలోచన రావడమే ఆలస్యం డైరక్టర్ బాబికి దానికి సంబందించిన పని మీదే ఉండమన్నాడట పవన్ కళ్యాణ్. సినిమా షూటింగ్ టైమ్లో కొన్ని ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయన్న సంగతి తెలిసిందే.

 

రేపు రిలీజ్ అవ్వనున్న సర్ధార్ ఫస్ట్ లుక్‌లో పవర్ స్టార్ న్యూ లుక్ రివీల్ అవ్వనున్నదనే సంతోషంలో ఉన్నారు అభిమానులు. సర్ధార్‌గా పవర్‌స్టార్ పోలీస్ డ్రెస్ లో ఉన్న పిక్చర్ రేపు మన ముందుకు రాబోతున్నాయి. గోపాలా గోపాలా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని పవర్ స్టార్ స్టార్ట్ చేసిన సినిమా కాబట్టి ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ వస్తాయా అని ఆడియెన్స్ అంతా ఎలర్ట్ అవుతారు. ఇక పవర్‌స్టార్ క్రేజ్ గురించి మనం చెప్పాల్సిన పనిలేదు.     

 

రిలీజ్ అయ్యే లుక్ కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మరో ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని అభిమానులు ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం క్రియేట్ అయిన రికార్డులన్నీ మళ్ళీ పవర్‌స్టార్ తన స్టామినాతో బ్రేక్ చేసే రోజుకోసం వెయిట్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సర్ధార్ సినిమా 2016 మార్చ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. పవర్‌స్టార్ సరసన డార్లింగ్ బ్యూటీ కాజల్ మొదటి సారిగా హీరోయిన్‌గా చేస్తుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: