తెలుగు ఇండస్ట్రీలో మెగా స్టార్ మేన అల్లుడిగా సినీమాలొకి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది కాలంలోనే స్టైలిష్ స్టార్ పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ (బన్ని) ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకరు. ఈయన తండ్రి అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్. తండ్రీ, మేనమామ సినీ ఇండస్ట్రీ బ్యాగ్ గ్రౌండ్ అయినా వారి ఇమేజ్ తనపై పడకుండా తన సొంతంగా మాస్ ఫాలోయింగ్ సంపదించాడు బన్ని. డ్యాన్స్,ఫైట్స్ లో మంచి పర్ఫామెన్స్ చూపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

అల్లు అరవింత్ ప్రేమ వివాహం.. తను కోరుకున్న అమ్మాయి  స్నేహ రెడ్డిని పెద్దలచే ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు పేరు అయాన్..మొన్న అల్లు అర్జున జాతీయ జెండాతో ఫోటో స్టిల్స్ ఇచ్చిడు ఇవి సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేశాయి. ఇప్పుడు తనుకూడా ఏం తక్కువ తినలేదు అంటున్నాడు బన్ని సుపుత్రుడు అయాన్..స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అయాన్ కూడా సందడి చేసారు. గీతాఆర్ట్స్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అల్లు అరవింద్ తన మనవడు అయాన్ ను కూడా తీసుకొచ్చారు. బుడి డుడి అడుగులు వేస్తూ అయాన్ జెండా వందనం చేయడం ఆకట్టుకుంది.

అల్లు అర్జున్ చిత్రంలో అల్లు అరవింత్, అయాన్


అయాన్ పుట్టినప్పటి నుంచి వివిధ అకేషన్లలో అల్లు అర్జున్ తన కొడుకు తో ప్రత్యేకంగా ఫోటో షూట్ నిర్వహించి ఆ ఫోటోలు విడుదల చేయడంతో అయాన్ కూడా అభిమానుల్లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య అయాన్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ ఫోటోను పోస్టు చేసింది మరెవరో కాదు...అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి. అయాన్ అద్దం ముందు నిల్చొని డాన్స్ చేస్తున్నాడు. వెంటనే స్నేహారెడ్డి ఈ ఫోటో క్లిక్ మనిపించారు. అయాన్ ఊపు చూస్తుంటే భవిష్యత్తులో తండ్రిని మించిన డాన్సర్ అవుతాడని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: