ఆగష్టు 7న భారీ అంచనాలతో రిలీజ్ అయిన మహేష్ బాబు శ్రీమంతుడు మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తో షాకింగ్ కలెక్షన్లతో రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులన్నీ శ్రీమంతుడు స్వీప్ చేసేసింది. ఇక కొద్దిగా కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయ్ అనుకునే సందర్భంలో మహేష్ కు ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవం, ఆ తర్వాత రోజు సండే కావడం వలన కలెక్షన్లు బాగా కలిసొచ్చాయి. వారం రోజులకే డిస్ట్రిబ్యూటర్లంతా లాభాల బాట పట్టారని ట్రేడ్ రిపోర్ట్.

 

అయితే సినిమా ఫుల్ రన్ విషయంలో కాస్త సందిగ్దం ఏర్పడుతుంది.. సినిమా ఫుల్ రన్ టైంలో అత్తారింటికి దారేది సినిమా రికార్డులన్ను క్రాస్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే తమిళ సెల్వంధన్ మాత్రం అక్కడ మార్కేట్ ప్రకారం ఫ్లాప్ సినిమాగా నిర్ణయించబడింది. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ల షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.  

 

ఏరియాల వారిగా శ్రీమంతుడు కలెక్షన్ల షేర్ రూపాయలలో నైజాం-17 కోట్ల 34 లక్షలు, సీడెడ్-7.43, ఈస్ట్ గోదావరి- 4.46, గుంటూరు- 4.44, ఉత్తరాంధ్ర- 4.15, కృష్ణా- 3.49, వెస్ట్ గోదావరి- 3.47, నెల్లూరు-1.54  టోటల్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కలుపుకుని 46. 32 కోట్లు. ఇక అమెరికా-11 కోట్ల 21 లక్షలు వసూలు చేయగా, రెస్ట్ ఆఫ్ ఓవర్సీస్ 2.16, కర్ణాటక 6.1, రెస్ట్ ఆఫ్ ఇండియా- 95 లక్షలు, తమిళనాడు (తెలుగు వెర్షన్) 95 లక్షలు, తమిళ వెర్షన్ 60 లక్షలు వసూలు చేసిందని రిపోర్ట్. ఇక వీటిన్నటిని కలుపుకుంటే శ్రీమంతుడు టోటల్ వరల్డ్ వైడ్ 10 రోజుల షేర్ 68 కోట్ల 28 లక్షలని తేలింది.

 

అయితే ఇంకా వారం పాటు ఏ సినిమా రిలీజ్ లేదు కనుక ఇలానే కలెక్షన్ల జోరు కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ నెల 21న మాస్ మహరాజ్ రవితేజ కిక్-2 రిలీజ్ అవ్వబోతుంది. కిక్-2 సినిమా ఎఫెక్ట్ ఎంతో కొంత శ్రీమంతుడు సినిమాపై అవకాశం ఉందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మహేష్ బాబు ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ద్వారానే మంచి మొతాన్ని రాబట్టాడని అనుకుంటున్నారు సిని లవర్స్ అంతా. 


మరింత సమాచారం తెలుసుకోండి: