నిన్న భాగ్యనగరంలో పార్క్ హయత్  హోటల్ లో ఎంతో ఆర్భాటంగా జరిగిన మెగాస్టార్ 60 జన్మదిన వేడుకలలో నoదమురి సింహం బాలకృష్ణ అనుకోని షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియకపోయినా చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించా యి. 

ఇక వివరాలలోకి వెళితే చివరి నిముషం వరకు వస్తాడో రాడో అని మురిపించిన పవన్ వచ్చినా ఆ పార్టీలో చాలా ముభావంగా పవన్ కూర్చుచున్నట్లు తెలుస్తోంది. దీనితో పవన్ మూడ్ ను చూసిన కొంతమంది పవన్ తప్పదని చిరంజీవి కోసం వచ్చాడా ?లేదంటే మెగా అభిమానులలో కామెంట్స్ వస్తాయి ? అనుకుని వచ్చాడా అంటూ కొందరు కామెంట్ చేసుకున్నట్లు టాక్. 

ఈ సందర్భంలో అక్కడ ఉన్న కొందరు మీడియా ప్రతినిధుల బలవంతం పై పవన్ రెండు మాటలు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే పవన్ చిరంజీవి షష్టిపూర్తి వేడుకలు వచ్చిన బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా మిగతా మోహన్‌బాబు, నాగార్జున, వెంకీ, రవితేజ, శ్రీకాంత్ అందరూ తనకు మిత్రులే అంటూ షాక్ ఇచ్చాడని టాక్. 

అయితే ఇలా పవన్ ప్రతిస్పందించడానికి పవర్ స్టార్ బాలకృష్ణ పేరు పొరపాటున మరిచిపోయడా ? లేదంటే తెలుగుదేశం పార్టీ పై ముఖ్యంగా చంద్రబాబు పై ఉన్న కోపం ఇలా పవన్ చేత మాట్లాడించిoదా అంటూ కొందరు కొత్త అర్ధాలు వెతుకున్నారు. ఈ వేడుకకు బాలకృష్ణ రావడం ఆశ్చర్యమైతే మరింత ఆశ్చర్యకరంగా పవన్ మౌనం చాలామందిని మరింత ఆశ్చర్య పరిచింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: