ఈ మధ్య కాలంలో ఏ మూవీ రిలీజ్ అయినా, మొదటగా దేశీ కలెక్షన్స్ కంటే ఓవర్సీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ముఖ్యంగా చూస్తారు. ఓవర్సీస్ లో సినిమా సత్తా చాటిందంటే చాలు, ఆ మూవీ కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ ని సాధిస్తుందనే చెప్పాలి. అందుకే తాజాగా మహేష్ శ్రీమంతుడు సుమారు 30లక్షల డాలర్లు వసూలు చేసి ఓవర్సీస్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

బాహుబలి తర్వాత ఈ స్థాయి వసూళ్లు సాధించిన ఏకైక సినిమా ఇదే. ఇప్పుడు కిక్2 పై ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంటుందని అందరూ ఎక్స్ పర్ట్ చేశారు. కాని కిక్2 కనీస వసూళ్లు అయినా సాధించలేకపోయింది. కిక్ సినిమాతో పోలిస్తే కిక్ 2 ఓవర్సీస్ మార్కెట్ లో డిజాస్టర్ అయ్యింది. కిక్2 లో కంఫర్ట్ అనే కాన్సెప్ట్ జనాలకి అంతగా నచ్ఛకపోవడంతోనే ఈ విధమైన రిజల్ట్ ని ప్రేక్షకుల వద్ద నుండి ఎదుర్కొవలసి వస్తుంది.

అందుకే, కిక్ లో ఉన్న కిక్కు కిక్2లో లేదని అందుకే విదేశీ ప్రేక్షకుల ఆదరణ పొందలేదని అంటున్నారు. కిక్  2 విషయంలో ఓవర్సీస్ పంపిణీదారులు బయ్యర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఫెయిల్యూర్ ని ఊహించలేదని వాపోతున్నారంతా.

బాహుబలి, శ్రీమంతుడు వంటి సినిమాలతో లాభాలతో ఉన్న విదేశి బయ్యర్స్..కిక్ 2 మూవీతో కొంత నిరుత్సాహంలోకి వెళ్ళారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రిజల్ట్ కి కిక్2 నిర్మాత గా ఉన్న కళ్యాణ్ రామ్ సైతం షాకై పోయాడంట.


మరింత సమాచారం తెలుసుకోండి: