తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ తారలు, సంగీత దర్శకులు సందడి చేయం కొత్తేమీ కాదు.. ఇక మెగాస్టార్ చిరంజీవి  ‘రిక్షావోడు’ సినిమాలో  ‘రూప్ తేరా మస్తా..’ అంటూ  పాడిన పాట అప్పట్లో సూపర్ హిట్ సాంగ్ గా నిలిచిపోయింది.. ఈ పాట పాడింది ప్రముఖ పాప్ సింగర్  బాబా సెహగల్. ఇక అప్పటి నుంచి తెలుగు లో అప్పుడప్పుడు పాడటం మొదలు పెట్టాడు.. ఆ మద్య వచ్చిన ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ ‘దెఖో దెఖో గబ్బర్ సింగ్ ’ అనే పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో వేరే చెప్పనవసరం లేదు.

బాబా సెహగల్ స్వతహాగా తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెబుతాడు...ఇక మనోడు పవన్ కళ్యాన్ పుట్టిన రోజు కానుకగా డిఫరెంట్ స్టయిలో తనకు తెలిసిన విద్య పాట దానిద్వారానే తన అభిమాన హీరోకి శుభాకాంక్షలు చెప్పాలని ప్లాన్ చేశాడట. గతంలో పవర్, పవర్ అంటూ... పవన్ కల్యాణ్ పై ఓ స్పెషల్ సాంగ్ ను విడుదల చేసిన బాబా సెహగల్ తాజాగా మరో పాటను విడుదల చేసారు. ఆ పాటకు పవన్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సెప్టెంబర్-2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. పవన్ కు బహుమతిగా ఈ పాటను అందించచారు సెహగల్. 'ఎ పవర్ సాంగ్' పేరుతో రిలీజ్ అయిన ఈ స్పెషల్ పాట .. పవన్ బర్త్ డే సందర్భంగా బాబా సైగల్ ఇచ్చే మ్యూజికల్ గిఫ్ట్ .

బాబా సెహగల్,పవన్ కళ్యాన్

Baba Sehgal Released Pawan Kalyan song

ఇక ఓ వైపు సింగర్ గా కొనసాగుతూనే.. నటుడిగానూ అదృష్టం పరీక్షించుకుంటున్న సెహగల్.. రీసెంట్ గా రుద్రమదేవి చిత్రంలో నటించాడు. సెప్టెంబర్-4న రుద్రమదేవి విడుదలవుతుండగా.. ఈ లోగా ఈ స్పెషల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. మొత్తానికి... సెప్టెంబర్ తొలివారంలో ఓ వైపు పాట.. మరోవైపు నటనతో మెప్పించేందుకు సిద్ధమయ్యాడు బాబా సెహగల్. పవన్‌కల్యాణ్‌ హీరోగా కేఎస్‌ రవీంద్ర(బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌' గబ్బర్‌సింగ్‌. ఈ చిత్ర టీజర్‌ను పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్‌ 2న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ పూర్తయింది

సర్ధార్ గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాన్ 


 ఈ సినిమాకు సంబంధంచి తర్వాత షెడ్యూల్‌లో కాజల్‌ అగర్వాల్‌ పాల్గొననున్నారట. పవన్‌కల్యాణ్‌తో మొట్టమొదటి సారిగా కలిసి నటిస్తున్న ఆమె ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌, కాజల్‌తో పాటుగా మరాఠి నటుడు శరద్‌ కేల్కర్‌, చరణ్‌ దీప్‌, తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: