బాలకృష్ణకు చిరంజీవికి అంతగా చెప్పుకోతగ్గ స్నేహబంధాలు లేవు. అందువల్లనే మెగా కాంపౌండ్ ఎప్పుడూ బాలయ్యతో అంతంత మాత్రంగానే వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా బాలకృష్ణ గత ఆదివారం జరిగిన చిరంజీవి షష్టిపూర్తి వేడుకలలో చాల ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా డాన్స్ లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని అక్కడితో వదిలివేయకుండా అల్లువారి అబ్బాయి అల్లుశిరీష్ బాలయ్యతో ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళుతున్నాడు. 

బాలకృష్ణతో కలిసి అల్లు శిరీష్ చాలా సేపు చిరంజీవి షష్టిపూర్తి వేడుకలలో గడిపాడట. ఆ సందర్భంలో బాలయ్య తన పట్ల చూపించిన అభిమానానికి పొంగిపోయానని అంటూ తన ట్విటర్ లో తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ట్విట్ చేయడమే కాకుండా బాలయ్యతో తాను తీయించుకున్న ఫోటోను తన అభిమానులకు షేర్ చేసాడు. 

అంతేకాదు తనకు బాలకృష్ణకు మధ్య స్నేహబంధం బాగా బలపడింది అని కామెంట్స్ కూడ చేసాడు. అల్లు కుటుంబంలో జాతకాల పట్ల ముహూర్తాల పట్ల విపరీతమైన నమ్మకం ఉన్న వ్యక్తిగా శిరీష్ ను చెపుతూ ఉంటారు. బాలకృష్ణకు కూడ ఈ నమ్మకాలు ఎక్కువే కాబట్టి ఆ అభిరుచులు వీరిద్దరిని కలిపాయి అనుకోవాలి. 

శిరీష్ కు సామజిక చైతన్యం ఎక్కువ కాబట్టి నెమ్మదిగా బాలయ్యను ఆధారంగా చేసుకుని భవిష్యత్ లో తెలుగుదేశం వైపు అడుగులు వేస్తాడేమో చూడాలి. ఏది ఎలా ఉన్నా వీరిద్దరి స్నేహం ఈనాటి వెబ్ మీడియాకు హాట్ టాపిక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: