చిరంజీవి నటించబోయే 150వ సినిమాకు సంబంధించి ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్  అనేక విషయాలను షేరు చేసుకుంటూ తన బాబాయి పవన్ పై ఒక వింత కోరిక బయట పెట్టాడు. మెగాస్టార్ సినిమా జీవితంలో ఈసినిమా స్పెషల్ గా ఉండాలని తమ మెగా ఫ్యామిలీ అంతా కోరుకోవడంతో  ఈ సినిమా కథ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు అని అంటూ  బెస్ట్  స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నానని కామెంట్ చేసాడు చరణ్. 

ఇదే సందర్భంలో మాట్లాడుతూ చరణ్ ఒక ఆశక్తికర విషయం కూడ షేర్ చేసుకున్నాడు. తన తండ్రి 150వ సినిమాలో తనతో పాటు మెగా ఫ్యామిలీ హీరోలు అంతా పవన్, బన్నీలతో కలుపుకుని ఏదో ఒక పాటలో కలిసి స్టెప్స్ వేసేలా ప్లాన్ చేయాలనే తన కోరికఅంటూ ఈ విషయంలో తాను విజయం సాధిస్తాను అన్న నమ్మకం ఉంది అని కామెంట్ చేసాడు. తన తండ్రి సినిమాలో చిరంజీవి ఒక్కరే హీరో అని కేవలం తాము అంత ఒక్క ఫ్రేమ్ లో మాత్రమె కనిపిస్తామా లేదంటే ఒక స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో కనిపిస్తామా అన్న విషయం ఈసినిమాకు ఎంపిక అయ్యే కథ బట్టి ఉంటుంది అన్నాడు చరణ్. 

అంతేకాదు ఈ సినిమాను తాను నిర్మాతగా నిర్మిస్తున్నాను కాబట్టి ఈ కోరికకు తన తండ్రి చిరంజీవితో పాటు అందరూ సహకరిస్తారు అన్న నమ్మకం తనకు ఉంది అంటూ  కామెంట్ చేసాడు చరణ్. ఈ సినిమాకు కథ ఓకే అయితే చాలు వెంటనే దర్శకుడిని ఎంపికచేసి ఆరు నెలల్లో పూర్తి చేస్తాను అంటున్నాడు చరణ్.  ఈ సినిమా కోసం తాను కొత్తగా  ప్రారంభిస్తున్న బ్యానర్  లో హనుమంతుడి బొమ్మతో మధ్యలో  కొణిదెల ఇంటి పేరు  వచ్చేలా ఈ బ్యానర్ లోగో ఉంటుది అని అంటున్నాడు చరణ్.

 బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ హిట్ చిత్రం ‘బజరంగీ భాయ్‌జాన్’ రీమేక్ హక్కులను తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ రిమేక్ హక్కుల తాను  కొనడానికి ప్రయత్నిస్తున్నానని చరణ్  చెప్పడం బట్టి చిరంజీవి 150వ సినిమా ఈ రెండు కథల మధ్య  ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. మరి ఈ పరిస్థితులలో చరణ్ కోరికను పవన్ ఎంతవరకు తీరుస్తాడో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: