స్క్రిప్ట్ రైటర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయవంతమైన సినిమాలకు రచయితగా పనిచేసిన కెఎస్. రవీంద్ర మాస్ మహారాజా రవితేజా ఇచ్చిన అవకాశంతో ‘పవర్’ సినిమాతో తన పవర్ చూపెట్టాడు. ఆ తరువాత అనుకోని అదృష్టం తలుపు తట్టడంతో ఇప్పుడు ఏకంగా పవన్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా తీసే స్థాయికి ఎదిగిపోయాడు. అటువంటి అదృష్టాన్ని అందుకున్న బాబి పవన్ బ్లాక్ బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

ఈసినిమాను బాబి ఇప్పటి వరకు 100 సార్లు చూసాడట. అంతేకాదు ఈసినిమా పై విలక్షణ కామెంట్స్ చేసాడు బాబి. చాలామంది దర్శకులు తాము దర్శకత్వం వహించిన సినిమాల విడుదలకు ముందు తమ హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథతో ఆ సినిమాను తీసామని చెపుతూ ఉంటారని అయితే ఒక హీరో బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే క్యారెక్టరైజేషన్స్ తయారు చేయడం చిన్న విషయమేమీ కాదు అంటూ కామెంట్ చేసాడు బాబి. 

కాని ‘గబ్బర్ సింగ్’ సినిమా విషయంలో హరీష్ శంకర్  పవన్ ను ఎలా చూపించాలో అలా చూపించడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయిందని అంటూ నిజానికి ఆ సినిమా బాలీవుడ్ సినిమా రీమేక్ అయినప్పటికీ పవన్ క్యారెక్టరైజేషన్ లోని తిక్కను చూపెడుతూ డిజైన్ చేయడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా మారిందని కామెంట్ చేసాడు బాబి. అంతేకాదు పవన్ తో సినిమాలు తీయాలి అనుకునే దర్శకులు అంతా ఒక్కసారి అయినా ‘గబ్బర్ సింగ్’ చూసి తీరాలని అంటూ పవన్ సైతం ఆ సినిమా నుంచి ఇన్ స్పైర్ అవ్వాల్సింది చాలా ఉందని అంటూ షాకింగ్ కామెంట్ చేసాడు. 

అందువల్లనే తాను ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ స్పాట్ కు వెళ్లేముందు ప్రతిసారి తాను ‘గబ్బర్ సింగ్’ ను చూస్తానని మళ్లీ మళ్లీ ఆ సినిమాను చూస్తూ ఉంటే పవన్ ను ఈసారి ఎలా చూపించాలి అన్నదితనకు తెలుస్తోందని కామెంట్ చేసాడు. అంతేకాదు ఈసినిమా నిమిత్తం  తాను కొన్ని నెలలుగా పవన్ తో ట్రావెల్ చేస్తూ ఉండటంతో తనకు పవన్ బాడీ లాంగ్వేజ్ తనకు పూర్తిగా అర్ధం అవడంతో పవన్ ను చాల డిఫరెంట్ గా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో చూపెట్ట బోతున్నాను అంటున్నాడు బాబి. అయితే ఇన్ని సార్లు ‘గబ్బర్ సింగ్’ సినిమాను చూసిన దర్శకుడు బాబి చెపుతున్న మాటలకు భయపడి కాబోలు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లోని చాలా సీన్స్ కు పవన్ బాబిని పక్కకు పెట్టి స్వయంగా పవన్ దర్శకత్వం వహిస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ 100 సార్లు ‘గబ్బర్ సింగ్’ చూసింది బాబికి వృథ అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: