తెలుగు ఇండస్ట్రీ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు నెం.1 దర్శకుల్లో ఒకరు.. ఈయన తీసిన సినిమాలు ఇప్పటి వరకు హిట్ వచ్చిన సినిమాలే.. ఈ మద్య తీసిన ‘బాహుబలి’ ఏకంగా తెలుగు వాడి గొప్ప తనం ప్రపంచ స్థాయికి వెళ్లింది...ఇక తమిళ,హిందీ ఇండస్ట్రీల్లో ఉన్న రికార్డులు తిరగ రాసింది. రాజమౌళి అంత పెద్ద పొజీషన్లో ఉన్న తన పక్క దర్శకులకు మంచి ఎంకరేజ్ మెంట్ ఇస్తాడు.. అందరితో కలుపుగోలిగా ఉంటారు. వాస్తవానికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వద్ద శిక్షణ పొంది తర్వాత దర్శకత్వం రూట్లోకి వచ్చిన రాజమౌళి సినిమా ఇండస్ట్రీలో కష్ట నష్టాలు అన్నీ అవసోసన పట్టిన వ్యక్తి.  

చిన్న నటుడైనా మంచీ అనిపిస్తే చాలు అతని గురించి తన ట్విట్టర్ లో పొగిడేస్తాడు.. గతంలో కొత్తగా వచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు హృదయ కాలెయం సినిమా గురించి ట్విట్ చేశాడు..అదే అతని వెయ్యి ఎనుగుల బలం ఇచ్చింది.. ఇప్పటికీ సంపూ ఏ కార్యక్రమంలో అయిన రాజమౌళి ప్రస్తావన లేకుండా ఉండరు. తాజాగా నాని, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్' సినిమా కూడా రాజమౌళి ప్రశంసించారు. ఈ సినిమా అందరినీ నవ్విస్తుందని కామెంట్ చేసారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్‌ సమర్పిస్తున్నారు.

భలే భలే మగాడివోయ్ చిత్రంలో నాని,లావణ్య త్రిపాఠి



ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ట్రైలర్‌ను సైతం మంచి ఆదరణ పొందుతోంది. సెప్టెంబర్ 4న ఈ చిత్రం విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని మతిమరుపు కుర్రాడిగా నటిస్తున్నాడు.  సాధారణంగా రాజమౌళి  తన అభిప్రాయాలు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రశంసలు గుప్పిస్తే ఆ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అందుకు కారణం ఆయన జడ్జిమెంట్ సూపర్ గా ఉంటుందని సినీ జనాల నమ్మకం. 

రాజమౌళి ట్విట్

మరింత సమాచారం తెలుసుకోండి: