డైరెక్టర్ శ్రీనువైట్ల ప్రిన్స్ మహేష్ ల సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ మహేష్  రేంజ్ ని పెంచింది. అటువంటి వీరద్దరి మధ్యా ‘ఆగడు’ సినిమా తరువాత కొంత గ్యాప్ ఏర్పడింది అన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపధ్యంలో  ఈమధ్య శ్రీనువైట్ల తాను లేటెస్ట్ గా రామ్ చరణ్ తో తీస్తున్న సినిమాకు సంబంధించి తీసుకున్న నిర్ణయం శ్రీనువైట్ల నిజంగానే మహేష్ పై అసహనంగా ఉన్నాడా ? అని అనిపించేడట్లుగా ఉంది. 

ఇక వివరాలలోకి వెళ్ళితే రామ్ చరణ్ తో శ్రీనువైట్ల తీస్తున్న సినిమాకు సంబంధించి క్లైమాక్స్ సీన్స్ చిత్ర్రీకరణకు యాక్షన్ కొరియో గ్రాఫర్ అనల్ అరసు ఆధ్వర్యంలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిద్దామని అనుకున్నాడట. దీనికి సంబంధించి శ్రీనువైట్ల అనల్ అరసుతో రెండు మూడు సార్లు మాట్లాడటం కూడ జరిగిందట. అయితే ‘శ్రీమంతుడు’ బ్లాకు బస్టర్ హిట్ అనల్ అరసుకు శ్రీనువైట్ల రామ్ చరణ్ సినిమాలో యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే అవకాశాన్ని పోగొట్టింది అంటూ రూమర్స్ వినపడుతున్నాయి.

అనుకోని ట్విస్ట్ ఇస్తూ చరణ్ శ్రీనువైట్లల సినిమా నుండి అనల్  అరసును ఎందుకు తప్పించారు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా శ్రీనువైట్లకు ‘శ్రీమంతుడు’ సినిమాకు పనిచేసిన టీమ్ ను ఎవరినీ తన సినిమాకు పెట్టుకోవడం ఇష్టంలేక ఇలా చేసాడు అనే వార్తలు వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతున్న ‘శ్రీమంతుడు’ పెద్ద గొప్ప సినిమాకాదు అని శ్రీనువైట్ల తన సన్నిహితులతో ఈమధ్య కామెంట్ చేసాడు అని ఫిలింనగర్ గాసిప్పులు వచ్చాయి. ఆ తరువాత అనల్ అరసును రామ్ చరణ్ సినిమా నుండి తప్పిచడం హాట్ టాపిక్ గా మారింది. 

ఈ వార్తలు ఇలా హడావిడి చేస్తూ ఉండటంతో నిజంగానే శ్రీనువైట్ల మహేష్ ల మధ్య గ్యాప్ ఏర్పడిందా? అనే గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ‘శ్రీమంతుడు’ సూపర్ సక్సస్ మహేష్ స్థాయిని పెంచడమే కాకుండా అతడిని చూసి ఈర్ష్యపడే వారి సంఖ్యను కూడ పెంచింది. అయితే అనల్ అరసుకు మాత్రం ఒక భారీ చిత్రాన్ని ‘శ్రీమంతుడు’ పోగొట్టాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: