సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి ఎంట్రీ ఇస్తే సెలబ్రెటీగా మారిపోతారు.. ఇక ఈ మద్య కాలంలో డబ్బు కోసం ఎంతటి నీచమైన పనికైనా వెనుకాడటం లేదు.. ఇక నగరంలో పెరుగుతున్న పబ్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కొందరు బడా బాబులు యువత బలహీనతలు క్యాష్ చేసుకోవడానికి పబ్బులు, రేవ్ పార్టీలు లాంటివి చేస్తూ యువతీ, యువకులకు ఆఫర్లు ఇచ్చి మరీ తమ దగ్గరకు రప్పించకుంటున్నారు. ఇక పెద్ద పెద్ద నగరాల్లో హైటెక్ వ్యభిచారం విపరీతం అయ్యింది.

ఈ హైటెక్ వ్యభిచారానికి కొన్ని మసాజ్ సెంటర్లు కేంద్రంగా మారుతున్నాయి... పెద్ద పెద్ద అపార్ట్ మెంట్స్ తీసుకొని అక్కడ కూడా ఆన్ లైన్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా విటులను ఆకర్షిస్తూ గుట్టుగా వ్యభిచారం కొనసాగిస్తున్నారు. ఇక ఈ సెక్స్ రాకెట్ లో కొందరు జూనియర్ ఆర్టిస్టులు..కాస్తో కూస్తో పేరు సంపాదించిన హీరోయిన్లు ఎంటర్ అవుతున్నారు. ఇలాంటి టాలీవుడ్ లో ఇప్పటికే చాలా జరిగినా తాజాగా మరో సెక్స్ రాకెట్ గుట్టు పోలీసులు విప్పారు.  ఇప్పటికే వ్యభిచారం, మత్తు పదార్తాల స్మగ్లింగ్ వంటి అంశాలతో ఉన్న పరిశ్రమలో మరో సెక్స్ రాకెట్ బయటపడింది ? ఇప్పటికే ఈ సెక్స్ రాకెట్ విషయం లో రోజుకో కొత్త న్యూస్ తో టాలీవుడ్ కి పెద్ద చిక్కు వచ్చి పడింది.

తాజాగా మరో సెక్స్ రాకెట్ గుట్టు నిన్న బయటపడిందట ! ఇందులో వర్థమాన  హీరోయిన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ హోటల్ లో ప్రముక రాజకీయ వేత్త తో కలిసి రోమాన్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్టు ఫిలిం నగర్ లో జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆ నటి ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు.  ఇలాంటి సంఘటన వల్ల టాలీవుడ్ పరువు పోతుందని సినీ పెద్దలు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నా..ఇలాంటి వ్యవహారాలు బయట పడుతూనే ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: