సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రెటీ తాము ఏం చేసినా చెల్లుతుందన్నధీమాతో ఉంటారు..ఇదే ధీమాతో యూఎస్ కాన్సులేట్ ను మోసం చేయడంతో  అడ్డంగా బుక్ అయ్యింది కేరళ నటి నీతూ కృష్ణ. మళియాళి సినిమాల్లో ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్న నితూ కృష్ణ అమెరికా వెళ్లేందరుకు వీసా కోరుతూ చెన్నై అమెరికన్ కాన్సులెట్ కు వచ్చింది. అందుకోసం ఆమె కొన్ని పత్రాలు యూఎస్ కాన్సులేట్ సమర్పించాల్సి ఉండగా..అతి తెలివితో తప్పుడు పత్రాలు సమర్పించి.. అసలే యూఎస్ కాన్సులేట్ ఎంక్వేయిరీ చాలా సీరియస్ గా ఉంటుంది.. ఈ అమ్మడు సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో అధికారులు పోలిసులకు ఫిర్యాదు చేశారు.

ఇక అవి నకీలీవని తనకు తెలియదని తను మోసపోయానని పోలీసు విచారణ లో తెలిపింది. అమెరికా వెళ్లి ఒక పెద్ద మ్యారేజ్ ఈవెంట్ లో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తే చాల డబ్బు వస్తుందని నిర్మాత రాజీ తనను సంప్రదించాడని దీనికోసం చెన్నై వెళ్లి వీసా తీసుకోవాలంటే రూ. 2 లక్షలు అవుతుందని చెబితే, తాను ఆ డబ్బు ఇచ్చానని, తనకు ఇలా తప్పుడు పత్రాలిచ్చి మోసం చేస్తాడని అనుకోలేదని తెలిపింది.

ఇదివరకు తాను విదేశాలకు ఎప్పుడూ వెళ్లింది లేదని అందుకే తనకు ఎలాంటి విషయాలు తెలియదని అంతా తామే చూసుకుంటామని చెప్పి తప్పుడు పత్రాలు తనకు ఇచ్చారని తాను ఏ మోసం చేయలేదని విచారం వ్యక్తం చేసింది నీతూ కృష్ణ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్మాతలు రాజి, బ్రోకర్ కుంజుమోన్ ల కోసం గాలిస్తున్నట్టు తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: