సెప్టెంబర్ 4న ఒకేరోజు విడుదల అవుతున్న నాని ‘భలే భలే మగాడివోయ్’ మంచు విష్ణు ‘డైనమేట్’ సినిమాలు పోటీగా విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ ఇద్దరి హీరోల మధ్య జరగబోతున్న పోటీ వెనుక ఒక ప్రతీకార మెలోడ్రామా యాదృచ్చికంగా జరగడం కొంతమందిని ఆశ్చర్య పరుస్తోంది. ఒకొక్కసారి ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగినా ఈ సంఘటనల వెనుక కొన్ని విపరీతార్ధాలను కొంతమంది తీస్తూ ఉంటారు. అటువంటి సందర్భమే ఇప్పుడు జరుగుతోంది. 

ఇక వివరాలలోకి వెళితే మంచు విష్ణు ‘ఢీ’ సినిమా చేస్తున్నపుడు ఓ కొత్త కుర్రాడు అసిస్టెంట్ గా చేరాడట. దాదాపు సినిమా పూర్తయ్యే సమయానికి చిన్నచిన్న ఇగో సమస్యలు వచ్చి ఆ కుర్రవాడు వచ్చాయి. ఆ కుర్రాడు ‘ఢీ’ సినిమా యూనిట్ నుండి బయటకు వచ్చేసాడు. అయితే ఆ తరువాత అతడికి అదృష్టం కలిసి వచ్చి హీరోగా చాన్స్ కొట్టేయడమే కాకుండా ప్రస్తుతం యంగ్ హీరోలలో ఒకడుగా ఎదిగి పోయాడు అతడే హీరో నాని. 

మంచు విష్ణు ‘ఢీ’  సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన నాని సినిమా మంచు విష్ణు సినిమాతో సెప్టెంబర్ 4న పోటీ పడటం ఒక అరుదైన ఆశ్చర్యకర సంఘటన. అయితే ట్విస్ట్ ఏమిటంటే ప్రస్తుతం విజయాలకు దూరంగా ఉన్న మంచు విష్ణు నానిలకు ఈ సినిమాల విజయం వారి కెరియర్ కు సంబంధించి చాల కీలకం. 

చిన్న సినిమాలుగా విడుదల అవుతున్న ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తాయా ? లేదంటే మంచు విష్ణు ‘డైనమేట్’ పై నాని ‘భలే భలే మగాడివోయ్’ విజయాన్ని సాధించి నాని మంచు విష్ణుతో గతానికి సంబంధించిన ఎకౌంట్ సెటిల్ చేసుకుంటాడా అనే విషయం సెప్టెంబర్ 4న తేలిపోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: