ప్రస్తుతం టాలీవుడ్ లో కోన వెంకట్ హవా నడుస్తోంది. టాప్ యంగ్ హీరోల సినిమాలకు కథలను ఇవ్వడమే కాకుండా నిర్మాతగా కూడ మారి కోన వెంకట్ సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. అంజలితో ‘గీతాంజలి’ సినిమాని తీసి నిర్మాతగా కూడ తన హవాను ప్రారంభించాడు. 

ప్రస్తుతం కళాతపస్వి విశ్వనాథ్ తీసిన ‘శoకరాభరణం’ సినిమా టైటిల్ ను తీసుకుని ఒక క్రైమ్ స్టోరీని బీహార్ బందిపోటు దొంగల నేపధ్యంలో నితిన్ ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడు. ప్రస్తుతం పరిశ్రమలో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈరచయిత తన కథల రూపంలోనే కాకుండా మరో రూపంలో కూడా బాగానే సంపాదించుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. 

సినిమా ప్రాజెక్టులు సెట్ చేయడం ఆ సినిమాకు తన పేరును సమర్పకుడిగా వేసుకోవడం ఆ  సినిమాలో షేర్‌ను తీసుకోవడం కోనవెంకట్ సంపాందనలోని రహస్యo అంటూ ఫిలింనగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఇక లేటెస్ట్ గా  నాగచైతన్య, గౌతమ్‌మీనన్ కలయికలో రూపొందుతున్న ‘సాహసమే శ్వాసగా సాగిపో’ చిత్రానికి కూడా కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు అని అంటున్నారు. అయితే ఈ చిత్రాలకు కోనవెంకట్ డబ్బు రూపంలో పెట్టుబడి ఏమీ పెట్టడని, కేవలం ఆ కాంబినేషన్‌లు సెట్ చేసి అందుకు ఫలితంగా సమర్పణ పేరుతో పాటు సినిమా బిజినెస్‌లో షేర్ తీసుకుంటూ ఒక రచయిత ఇన్ని రకాల వ్యాపారాలు చేయగలడా అని అందరూ ఆశ్చర్య పోయేలా చేస్తున్నాడు అని టాక్ .

ఇది చాలదు అన్నట్లుగా కోన వెంకట్ నిఖిల్ నందిత జంటగా నటిస్తున్న ‘శంకరాభరణం’ సినిమాకు సంబంధించిన ఒక పాటకు కొరియోగ్రఫీ చేసి మరో సంచలనాన్ని సృస్టించాడు ఈసినిమా రచయిత. ఏది ఎలా ఉన్న కోన వెంకట్ తెలివితేటలకు సంబంధించిన వార్తలు నేటి టాలీవుడ్ కు హాట్ టాపిక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: