తెలుగు ఇండస్ట్రీలో నాగచైతన్య తో ‘ఏం మాయ చేసావే’ సినిమాతో  తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మళియాళీ భామ సమంత. వచ్చిన వెంటనే అగ్ర హీరోల సరసన నటిస్తూ  మంచి హిట్లు సాధించింది. సమంత నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , అత్తారింటికి దారేది  చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.

అప్పట్లో ఈ అమ్మడు  ‘గోల్డెన్ లెగ్’ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక అన్ని రోజులు మనవి కాదన్నట్లు గా తర్వాత సమంత సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతూ వచ్చాయి దీంతో ఈ అమ్మడిని ఐరెన్ లెగ్  హీరోయిన్ అంటూ కామెంట్లు చేశారు. దీంతో ఈ అమ్మడికి చిర్రెత్తుకొచ్చింది మంచి పాత్రలు రాకపోతే సినిమాలు ఆడకపోతే నాదా తప్పు ఇప్పటి నుంచి మంచి పాత్రలు వస్తేనే చేస్తే లేదంటే సినిమాలకే స్వస్తి చెబుతా అన్ని అప్పట్లో బాహటంగానే చెప్పేసింది. తెలుగులో అదృష్టం బాగా లేదని తమిళ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది.. విజయ్ తో నటించిన కత్తి సినిమా మినహా ఏ సినిమాలు అంత హిట్ కాలేదు.


సమంత హాట్ ఫోటోస్


ఇక సూర్య సరసన ‘అంజాన్’ సినిమాలో ఈ అమ్మడు బికినీ వేసినప్పటికీ కూడా ఏం లాభం లేకపోయింది. అభిమానులు ఈ చిత్రాన్ని అట్టర్ ఫ్లాప్ చేసారు.  తాజాగా  విక్రమ్ సరసన ‘10 ఎంద్రతుకుల్ల’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలకు దూరమవుతానంటూ మళ్లీ సంచలన కామెంట్స్ చేసింది. గతంలో చెప్పినట్లు మంచి పాత్రలు రాకపోతే సినిమాల నుంచి తప్పుకుంటాను. ఇంకా అదే మాటపై నిలబడతాను. కాకపోతే ప్రస్తుతం తనకు మంచి పాత్రలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: