బాలీవుడ్ అందాల నటి నర్గీస్,సునీల్ దత్ ముద్దు కొడుకు.. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని... 1993 ముంబై పేలుళ్ల కేసుకు సంబందం ఉందని  పుణె ఎర్రవాడ జైలులో ఐదేండ్ల శిక్ష అనుభవిస్తున్నారు. అయితే సంజయ్‌దత్‌ కుమార్తె ముక్కుకు సర్జరీ జరగనుండడంతో, తండ్రిగా తన కుమార్తె బాగోగులు చూసుకోవాల్సి వుందంటూ పెరోల్‌ కోసం అప్లయ్‌ చేసుకున్నాడు ఈ మున్నాభాయ్‌.

కోర్టు, సంజయ్‌దత్‌ అభ్యర్థనను మన్నించింది. ఇప్పటికి మూడు సార్లు పెరోల్‌ పొందిన సంజయ్‌దత్‌ నాలుగోసారి పెరోల్‌ సంపాదించుకున్నాడు. నెల రోజులపాటు సంజయ్‌దత్‌ పెరోల్‌పై జైలుకు దూరంగా వుండనున్నాడు.గతంలో కుటుంబంతో నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకునేందుకు గత డిసెంబర్‌లో పెరోల్ పైన విడుదలైన సంజయ్.. 14 రోజుల తర్వాత జనవరిలో తిరిగి ఎర్రవాడ జైలుకు చేరుకున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు సంజ‌య్‌కు పెరోల్ మంజూరు చేయ‌డంపై దేశ‌వ్యాప్తంగా ప‌లు విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి.తనకు పేరోల్ కావాలని సంజయ్ దత్ తరపున ఆయన న్యాయవాది ఫూణే పోలీస్ కమీషనర్ చోకలింగం జూలై మాసంలో దరఖాస్తు చేయగా, రెండు రోజుల క్రితం పోలిస్ కమీషనర్ సమ్మతించి సంజయ్ కు పేరోల్ అనుమతించారు.

కుటుంబంతో సంజయ్ దత్  (ఫైల్)


30 రోజులపాటు సంజయ్ దత్ పెరోల్పై జైలు వెలుపల ఉండనున్నారు. అయితే సంజయ్‌దత్‌కి ఇలాగే పెరోల్‌ ఇచ్చుకుంటూ పోతే మిగతా ఖైదీలు సైతం పెరోల్‌ కోసం అభ్యర్థిస్తారనీ, అలాంటి వారికి ఏం సమాధానం చెబుతారంటూ న్యాయ నిపుణులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖుడు కావడంతోనే సంజయ్‌దత్‌ కోరుకున్నప్పుడల్లా పెరోల్‌ లభిస్తోందన్నది వారి వాదన. అయితే మానవీయ కోణంలో చూడాల్సిన అంశాన్ని వివాదం చేయడం తగదంటూ సంజయ్‌దత్‌ సన్నిహితులు, సినీ మిత్రులు, సెలబ్రిటీలు కోరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: